బీజింగ్‌ సదస్సుకు తెలుగు న్యాయవాది


సాక్షి, హైదరాబాద్‌: చైనా రాజధాని బీజింగ్‌లో అంతర్జాతీయ న్యాయవాదుల సంస్థ వార్షిక సమావేశానికి తెలంగాణ న్యాయవాది లక్కరాజు పద్మారావు హాజరయ్యారు. భారత్‌ తరఫున ఈ కార్యక్రమానికి హాజరైన ఏకైన భారత న్యాయవాది పద్మరావే. ఈ నెల 10-14 తేదీల మధ్య జరిగే ఈ సదస్సులో పద్మరావు  'సాక్ష్యాధారాలుగా వాంగ్మూలాలను రాబట్టే పద్ధతులు’పై ప్రసంగించనున్నారు.ప్రపంచ ప్రఖ్యాత న్యాయ నిపుణులతో కలిసి అభిప్రాయాలను పంచుకునే, అంతర్జాతీయ వేదిక నుంచి ప్రసంగించే గొప్ప అవకాశం తెలంగాణకు చెందిన వ్యక్తి పద్మరావు లక్కరాజుకు దక్కింది. సుమారుగా 90 దేశాల నుంచి 500 మంది ప్రాసిక్యూటర్లు హాజరవుతున్న ఈ సదస్సులో  ‘న్యాయవాద వృత్తి ద్వారా సామాజిక ప్రయోజనం సాధించే విధానాల’ పై ప్రధానంగా చర్చ జరగనుంది.

Back to Top