మంత్రివర్గ విస్తరణ గురించి తెలియదు : కేటీఆర్‌

KTR Press Conference At Telangana Bhavan Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు అన్నారు. జూన్‌ 27 నుంచి జూలై 31 వరకు 50 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించామని తెలిపారు. సభ్యులుగా చేరిన వారికి ప్రమాద బీమా అందేలా చూస్తామని, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీకి రూ.11 కోట్ల 21 లక్షల రూపాయలకు చెక్‌ ఇచ్చామని వెల్లడించారు. సభ్యత్వ కార్యక్రమంలో క్రియాశీలంగా పనిచేసిన నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు గతంలో కూడా పెద్దపెద్ద మాటలు మాట్లాడారని.. కొందరు గడ్డాలు కూడా తియ్యమని శపథాలు చేశారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలకు సమస్యలు దొరకడం లేదని.. అందుకే పసలేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లోనే వారికి సమాధానం చెబుతామని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ గురించి తనకు తెలియదన్నారు. గవర్నర్‌ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్టు వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top