మాకు మేమే పోటీ..

KTR challenges Harish Rao to get more majority in Medak  - Sakshi

కాంగ్రెస్, బీజేపీతో కానే కాదు  

మా అభ్యర్థుల గెలుపు ఎప్పుడో ఖాయమైంది  

కాంగ్రెస్‌కు ఓట్లేస్తే మురికి కాల్వలో వేసినట్లే​​​​

మెదక్‌ సమావేశంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

సాక్షి, మెదక్‌: ‘‘లోక్‌సభ ఎన్నికలైనా, ఏ ఎన్నికలైనా, మాకు మేమే పోటీ.. కాంగ్రెస్, బీజేపీతో కానే కాదు.. మా అభ్యర్థుల గెలుపు ఎప్పుడో ఖాయమైంది.. తేలాల్సింది మెజార్టీయే’’అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు అన్నారు. మెదక్‌ పట్టణంలో శుక్రవారం జరిగిన మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక, నర్సాపూర్, పటాన్‌చెరు ఎమ్మెల్యేలు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, గజ్వేల్‌కు చెందిన నేతలు పాల్గొన్నారు. బహిరంగ సభను తలపించేలా సుమారు 20,000 మంది కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. కేటీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఓట్లేస్తే మురికి కాల్వలో వేసినట్లేనని అన్నారు.  

పెద్దగా ఏమీ లేదు.. 
‘2014లో ప్రజలకు మోదీ అంటే ఏదో చేస్తారు.. ఏదో ఉద్దరిస్తారని ప్రజలు భావించి ఆనా డు మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి 283 సీట్లు కట్టబెట్టారు. ఐదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఒరిగిందేమీ లేద’ని కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. ‘ఏం చేసిండ య్యా మోదీ అంటే.. మా అక్కాచెల్లెళ్ల పోపు డబ్బాల్లో వేలు పెట్టిండు.. పెద్ద నోట్లు రద్దు చేసిండు తప్ప.. చేసింది మాత్రం పెద్దగా ఏమీ లేద’న్నారు. ఎన్డీఏకు 150 నుంచి 160, యూపీఏ కూటమికి 100– 110 సీట్లు దాటే అవకాశం లేదని అన్నారు. ఢిల్లీ ఎర్రకోట మీద కూడా జెండా ఎవరు ఎగురవేయాలో తెలంగా ణ ప్రజలు నిర్ణయించే స్థితిలో ఉండాలన్నారు.
 
ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి 
‘ఎవరిదగ్గర అయితే బడిత ఉంటే.. ఆయన బయట ఉండే బర్రెను మలుపుకుపోయే పరిస్థి తి ఉందని కేటీఆర్‌ అన్నారు. ‘మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉంటే పశ్చిమ బెంగా ల్‌కు; లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రైల్వే మంత్రిగా ఉంటే బిహార్‌కు రైళ్లను తీసుకుని పోయారు, ప్రధాని మోదీ గుజరాత్‌కు చెందిన నాయకుడు కాబట్టి బుల్లెట్‌ రైలు ప్రవేశపెట్టాల్సి వస్తే ఢిల్లీ నుంచి ముంబైకి మొత్తం గుజరాత్‌లో నుంచి రైలు మార్గం పోయింది’ అని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ గానీ, హైదరాబాద్‌ గానీ, దక్షిణాది రాష్ట్రాలు గానీ వారి ప్రణాళికలో ఎక్కడైనా ఉన్నాయా అని ఒక్కసారి ఆలోచించాలని కోరా రు.

కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్ట్‌ల్లో ఏదో ఒకదానికి జాతీయహోదా ఇవ్వాలని గతంలో గజ్వేల్‌ సభలో సీఎం కేసీఆర్‌ కోరితే ప్రధాని ముసిముసి నవ్వులు నవ్వి అవతలపడ్డారు తప్ప జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శిం చారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథకు కలిపి మొత్తం రూ.24 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి నీతి ఆయోగ్‌ వాళ్లు సిఫార్సు చేస్తే 24 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. ప్రధాని మోదీ, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విధిలేని పరిస్థితుల్లో ఎన్నికల కోసం మన రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టారని అన్నారు.  

రెండు ఓట్లు ఎక్కువే తెచ్చుకుంటాం..  
హరీశ్‌రావు ఒక మాటన్నారు.. ‘మన పోటీ కరీంనగర్, వరంగల్‌తో అన్నారు. నేను కరీంనగర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా.. నేను మిమ్మల్ని సవాల్‌ చేస్తా ఉన్నా.. మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో నాకంటే ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చి రుజువు చేసుకోవాలి.. వేదిక మీద ఉన్న నాయకులకు సవాల్‌ చేస్తున్నా’అని కేటీఆర్‌ సరదాగా అన్నారు. కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మీ నియోజకవర్గం కంటే రెండు ఓట్లన్నా ఎక్కువ తెచ్చుకుని కరీంనగర్‌ నుంచి ముందుంటాం అని ధీమా వ్యక్తం చేశారు. బావబామ్మర్దికాదు.. మేము అంతా మంచిగనే ఉన్నాం అంటూ కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

వరంగల్, కరీంనగర్‌ అభ్యర్థులతోనే పోటీ: హరీశ్‌  
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ ఎంపీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని 5 లక్షలకు పైగా మెజార్టీతో గెలిపించుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో తమకు కాంగ్రెస్, బీజేపీతో పోటీ కాదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తమ పార్టీకే చెందిన వరంగల్, కరీంనగర్‌ అభ్యర్థులతో పోటీ అని.. అక్కడి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకంటే ఎక్కువ మెజార్టీతో మెదక్‌ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లను గెలుస్తామని.. కేంద్రాన్ని శాసించే దిశగా టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కాగా, టీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశానికి సుమారు 20,000 మంది హాజరైనట్లు నేతలు చెబుతున్నారు. వీరికి భోజనసదుపాయం కల్పించారు.

నిధులు రాబట్టడమే థర్డ్‌ ఫ్రంట్‌ లక్ష్యం  
హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి కావాల్సిన నిధులను సమకూర్చడమే ధ్యేయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. కొంపల్లిలో శుక్రవారం మల్కాజ్‌గిరి పార్లమెం టరీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ సన్నాహక సదస్సులో ఆయన ప్రసంగిం చారు. ఢిల్లీలోని ఎర్రకోట మీద జెండా ఎగురవేసే సత్తా ఫెడరల్‌ ఫ్రంట్‌కు ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి అభ్యర్థులు దొరకడమే గగనంగా మారిందని ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానానికి డీకే అరుణను పోటీ చేయాలని కోరితే టీఆర్‌ఎస్‌ ప్రభంజనానికి భయపడి జైపాల్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని తప్పించుకుంటున్నా రని అన్నారు. సమావేశంలో మంత్రులు చామకూర మల్లారెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాజ్యసభ సభ్యు డు, టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కేశవరావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top