‘మినీ’ని సుందరంగా తీర్చిదిద్దుతాం

Koudi Palli Cheruvu Developed To Mini Tank Bund In Sangareddy - Sakshi

మినీ ట్యాంక్‌బండ్‌తోపాటు కౌడిపల్లిలోని రోడ్డుపక్కన మొక్కలు పెంపకం

పనులకు ముందుకు వచ్చిన ఎంఎస్‌ అగర్వాల్‌ ఫౌండ్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ

డీపీఓ, గ్రామస్తులతో కలిసి పరిశీలించిన కంపెనీ ప్రతినిధులు

సాక్షి, కౌడిపల్లి(నర్సాపూర్‌): కౌడిపల్లి పెద్దచెరువు మినీట్యాంక్‌బండ్‌పై అందమైన మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దుతామని డీపీఓ హనూక్‌ తెలిపారు. మంగళవారం కౌడిపల్లిని దత్తత తీసుకున్న ఎంఎస్‌ అగర్వాల్‌ ఫౌండ్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజర్స్‌ సుజీంద్ర, దిలీప్‌దాస్‌తో కలిసి డీపీఓ హనూక్‌ మినీ ట్యాంక్‌బండ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాలమేరకు ఎంఎస్‌ అగర్వాల్‌ కంపెనీ మండలాన్ని దత్తత తీసుకుందన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మినీ ట్యాంక్‌బండ్‌తో పాటు కౌడిపల్లి గ్రామంలో మొక్కలు నాటడంతోపాటు వాటికి రక్షణ కల్పిస్తుందన్నారు.

ట్యాంక్‌బండ్‌ను అందంగా తీర్చిదిద్దేందుకు స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అందులో భాగంగా మొక్కలు సైతం పెంచనున్నట్లు తెలిపారు. నాటిన మొక్కలకు రక్షణ చర్యలు చేపట్టి నీరు పోయడంతో పాటు కాపలా ఏర్పాటు చేస్తామన్నారు. కట్టపై అందంగా మొక్కల పెంపకం.. కట్టపై అందంగా కనిపించే పూల మొక్కలు నీడనిచ్చే మొక్కలు పెద్దగా పెరిగే వివిధ రకాల మొక్కలను నాటుతామని తెలిపారు. అనంతరం ఎంఎస్‌ అగర్వాల్‌ కంపెనీ ప్రతినిధి సుజీంద్ర మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాలతో ట్యాంక్‌బండ్‌నూ పరిశీలించినట్లు తెలిపారు. అధికారులు సూచనలు ఖర్చు అంచనాలను కంపెనీకి సమర్పించిన అనంతరం పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కోటిలింగం, ఏపీఓ శ్యాంకుమార్, ఈసీ ప్రేంకుమార్, సర్పంచ్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు పిశ్కె శెట్టయ్య, చంద్రం దుర్గాగౌడ్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top