‘10 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తాం’

Komatireddy Venkat Reddy Says Congress Will Provide Unemployment Benefit - Sakshi

సాక్షి, నల్గొండ : కమిషన్ల కోసమే టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రాజెక్టుల రీడిజైన్‌ చేపట్టారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆరోపించారు. గురువారం నార్కెట్‌పల్లిలో ప్రచార కార్యక్రమంలో కోమటిరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని పేర్కొన్నారు. 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. అదే విధంగా రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని,  నిరుపేదల ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top