నేడు కేసీఆర్‌ కీలక భేటీ

KCR Today Meeting With Employees - Sakshi

ఉద్యోగ సంఘాలతో నేడు సమావేశం కానున్న సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌  మరో ముందడుగు వేశారు. నేడు మధ్యాహ్నం ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. కీలకమైన పీఆర్సీ, ఇతర అంశాలపై నేడు వారితో చర్చించే అవకాశం ఉంది. గురువారం జరిగే కేబినేట్‌ సమావేశానికి ముందు ఉద్యోగ సంఘాలతో భేటీ కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రేపు జరగనున్న కేబినేట్‌ భేటీకి మంత్రులందరు హైదరాబాద్‌లో ఉండాలని కేసీఆర్‌ ఆదేశించారు. దీంతో నేడు జరిగే ఉద్యోగ సంఘాల సమావేశంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గురువారం ఉదయం జరిగే మంత్రి మండలి సమావేశం అనంతరం ఎన్నికలపై తుది ప్రకటన విడుదలైయే అవకాశం ఉంది. కాగా ఇటీవల రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగులకు భారీగా 35 శాతం ఫిట్‌మెంట్‌తో కొత్త వేతన సవరణను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మిగిలిన ఉద్యోగ సంఘాలతో కూడా సమావేశమై వారి సమస్యలపై నేడు చర్చించే అవకాశం ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top