తొలితరం ఉద్యమనేతకు కేసీఆర్‌ సాయం 

KCR Sanctioned CM Relief Fund To Kolluri Chiranjeevi - Sakshi

సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ.5.60 లక్షలు మంజూరు    

హైదరాబాద్‌: ఊపిరితిత్తులు, శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల చికిత్స చేయించుకున్న తొలితరం ఉద్యమ నేత కొల్లూరి చిరంజీవికి సీఎం కేసీఆర్‌ ఆర్థికసాయం అందించారు. ఆయన ఆపరేషన్‌కు అయిన రూ.5.60 లక్షలను సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద మంజూరు చేయించారు. 1969 జై తెలంగాణ ఉద్యమకారుల సంఘం నేత, బహుజన ఉద్యమ నాయకుడు అయిన చిరంజీవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇటీవల ఆపరేషన్‌ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టున్న విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు తీసుకెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించి ఆపరేషన్‌కు అయిన పూర్తి ఖర్చును రిలీఫ్‌ ఫండ్‌ కింద మంజూరు చేయాలని ఆదేశించారు.  లక్డీకపూల్‌లోని తన నివాసంలో ఉంటున్న కొల్లూరిని బీఎస్‌ రాములు, కమిషన్‌ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, జూలూరు గౌరీ శంకర్‌లు కలసి పరామర్శించా రు. తనకు ఆర్థికసాయం అందించిన సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపార
చిరంజీవిని పరామర్శిస్తున్న బీసీ కమిషన్‌ సభ్యులు రాములు, జూలూరు, వకుళాభరణం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top