అభివృద్ధి వ్యతిరేక ముఠాగా టీటీడీపీ: కర్నె

అభివృద్ధి వ్యతిరేక ముఠాగా టీటీడీపీ: కర్నె


సాక్షి, హైదరాబాద్‌: టీటీడీపీ నాయకులు తెలంగాణ అభివృద్ధి వ్యతిరేక ముఠాగా ఏర్పడ్డారని, ప్రభుత్వంపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ మండి పడ్డారు. గురువారం టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అబద్ధాలు మాట్లాడటంలో రేవంత్‌రెడ్డి, ఆయన ముఠాకు అవార్డు ఇవ్వొచ్చన్నారు.


అభివృద్ధి లో తెలంగాణ వెనుకబడి పోవాలని, ఏపీ అగ్రభాగాన నిలవాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నట్లు అనిపిస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై రాష్ట్రంలో ఏ గ్రామం లోనైనా చర్చకు తాము సిద్ధమన్నారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీపై గజ్వేల్‌ ప్రజాపోరులో రేవంత్‌ పిచ్చి కూతలు కూయడం దిక్కుమాలిన రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై రేవంత్‌ పేదల ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు.

Back to Top