చెప్పడం కాదు.. చేతల్లో చూపండి: జీవన్‌

చెప్పడం కాదు.. చేతల్లో చూపండి: జీవన్‌


సారంగాపూర్‌(జగిత్యాల): ‘అధికారంలోకొస్తే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. తీరా అధికారంలోకొచ్చి మూడేళ్లవుతున్నా పట్టిం చుకోవడం లేదు. మీరన్నట్లు గిరిజనులకు 12శాతం కాదు.. కనీసం 10శాతం అమలు చేసినా చాలు..’ అని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సూచించారు. సారంగా పూర్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ..  చెల్లప్ప కమిటీలో కొన్ని కులాలను గిరిజనుల జాబితాలో చేర్చే సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

Back to Top