అంతర్రాష్ట్ర వ్యాపారంతో ఖజానాకు కళ

Interstate business - Sakshi

జీఎస్టీకి తోడుగా పుంజుకుంటున్న ఐజీఎస్టీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఖజానాకు అంతర్రాష్ట్ర వ్యాపారం ఊతమిస్తోంది. గడిచిన 3 నెలల్లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా రాష్ట్రానికి రూ.2,446 కోట్ల ఆదాయం రాగా.. ఇదే వ్యవధిలో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ దిగుమతి చేసుకున్న వస్తువుల ద్వారా (ఐజీఎస్టీ) రూ.2,100 కోట్ల ఆదా యం ఖజానాలో జమైంది.

ఈ జూలై నుంచి జీరో దందా తగ్గటంతో పాటు పన్ను పరిధి లోని వాణిజ్య, వ్యాపార సంస్థల సంఖ్య పెరి గింది. దీంతో అంతర్రాష్ట్ర వాణిజ్యం మెరుగు పడిందని వాణిజ్య పన్నుల శాఖ విశ్లేషించు కుంటోంది. జీరో దందాకు అడ్డుకట్ట పడటం తో పాటు పన్ను ఎగవేత లేకుండా జీఎస్టీ అమలు చేసే విధానాలు, నకిలీ జీఎస్టీ క్లెయిమ్‌లను అరికట్టడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

ఏటా రూ.12,000 కోట్లు!
రాష్ట్రాల్లో వసూలైన ఐజీఎస్టీ ముందుగా కేంద్రానికి బదిలీ అవుతుంది. అక్కడి నుంచి వస్తు సేవలను దిగుమతి చేసుకున్న రాష్ట్రా లకు ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ పేరిట కేంద్రం పంపిణీ చేస్తుంది. దీనిలో భాగంగా తొలి 3 నెలల్లోనే రూ.2,000 కోట్లకు పైగా సొమ్ము రాష్ట్ర ఖజానాకు బదిలీ అయింది.

ఐజీఎస్టీ ఆదాయం తెలంగాణకు ఊతంగా నిలుస్తుం దని అధికారులు భావిస్తున్నారు. ఫలితంగా ఐజీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం ప్రతి నెలా రూ.1,000 కోట్లు దాటుతుందని, ఏటా రూ.12 వేల కోట్లు మించిపోతుందని అంచనా.  జీఎస్టీ, ఐజీఎస్టీ ద్వారా వచ్చే ఆదా యం పెరిగితే ఈ అంచనాలు చేరుకోవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top