టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదుకు ఇన్‌చార్జీలు

Incharges for TRS membership registration - Sakshi

నేడు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌తో భేటీ

జూలై 20లోగా పూర్తిచేయాలని కేసీఆర్‌ ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదుతో పాటు పార్టీ కమిటీల ఏర్పాటును పర్యవేక్షించేందుకు 69 మంది పార్టీ నేతలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఇన్‌చార్జీలుగా నియమించారు. పూర్వపు జిల్లాల పరిధిలోని అసెంబ్లీ నియోజవకర్గాల వారీగా ఇన్‌చార్జీలుగా వ్యవహరించే 69 మంది పార్టీ నేతలను జాబితాలో చేర్చారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు కొందరు క్రియాశీల నేతలకు కూడా ఈ కమిటీలో చోటు దక్కింది. సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీల ఏర్పాటు ఇన్‌చార్జీలుగా నియమితులైన నేతలు తక్షణమే బాధ్యతలు తీసుకుని, జూలై 20వ తేదీలోగా సభ్యత్వ నమోదు పూర్తి చేయాల్సిందిగా కేసీఆర్‌ ఆదేశించారు. కాగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలుగా నియమితులైన పార్టీ నేతలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆదివారం ఉదయం తెలంగాణ భవన్‌లో సమావేశమవుతారు. కాగా ఈనెల 27న పార్టీ అధ్యక్షుడి హోదాలో సీఎం కేసీఆర్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 50వేలు చొప్పున కోటి మంది నుంచి సభ్యత్వ సేకరణను లక్ష్యంగా నిర్దేశించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు, పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కొత్తగా ఇన్‌చార్జీలుగా నియమితులైన నేతలు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండాల్సిందిగా పార్టీ ఆదేశించింది. పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు, కమిటీల ఏర్పాటులో పాటించాల్సిన నియమ నిబంధనలపై ఆదివారం జరిగే సమావేశంలో ఇన్‌ చార్జిలకు కేటీఆర్‌ దిశా నిర్దేశం చేస్తారు. 

సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలు, నియోజకవర్గాలు.. 
ఆదిలాబాద్‌ జిల్లా:  మూల విజయారెడ్డి (చెన్నూరు, మంచిర్యాల), అరిగెల నాగేశ్వర్‌రావు (బెల్లంపల్లి, ఖానాపూర్‌), నారదాసు లక్ష్మణ్‌రావు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌), లోక భూమారెడ్డి (ఆదిలాబాద్, బోథ్‌), ఎండీ ఖాజా ముజీబుద్దిన్‌  (నిర్మల్, ముథోల్‌) 
హైదరాబాద్‌ జిల్లా:  విప్లవ్‌ కుమార్‌ (సనత్‌నగర్‌), వీకే మహేశ్‌ (కూకట్‌పల్లి), బండి రమేశ్‌ (ఖైరతాబాద్‌), పుటం పురుషో త్తం (ఎల్‌బీనగర్‌), కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి (ఉప్పల్‌) మలిపెద్ది సుధీర్‌రెడ్డి (మల్కాజిగిరి), బక్కి వెంకటయ్య (సికింద్రాబాద్‌),  చిరుమల్ల రాకేశ్‌ (కంటోన్మెంట్‌), రాంబాబు యాదవ్‌ (ముషీరాబాద్‌) పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (శేరిలింగంపల్లి), తాడూరి శ్రీనివాస్‌ (జూబ్లీహిల్స్‌) జిన్నారం వెంకటేశ్‌గౌడ్‌ (గోషామహల్‌), జహంగీర్‌పాషా (చార్మినార్, చాంద్రాయణగుట్ట, నాంపల్లి), తారిక్‌ అన్సారీ (మలక్‌పేట్, బహదూర్‌పుర) నిరంజన్‌ వాలి (కార్వాన్, యాకుత్‌పుర) 
కరీంనగర్‌ జిల్లాః  గూడూరు ప్రవీణ్‌ (మానకొండూరు, చొప్పదండి), బస్వరాజు సారయ్య (హుజూరాబాద్, హుస్నాబా ద్‌), టి.భానుప్రసాద్‌రావు (సిరిసిల్ల, వేములవాడ),  
ఎల్‌.రూప్‌సింగ్‌ (జగిత్యాల, కోరుట్ల), గుండు సుధారాణి (కరీంనగర్‌), కోలేటి దామోదర గుప్తా (ధర్మపురి, పెద్దపల్లి), కర్రా శ్రీహరి (మంథని, రామగుండం) 
ఖమ్మం జిల్లా: పల్లా రాజేశ్వర్‌రెడ్డి (ఖమ్మం, పాలేరు), తాతా మధు (వైరా, మ«ధిర), తెల్లం వెంకట్రావు (భద్రాచలం, పినపాక), రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి (అశ్వారావు పేట, సత్తుపల్లి), నూకల నరేశ్‌రెడ్డి (కొత్తగూడెం, ఇల్లందు), 
మహబూబ్‌నగర్‌ జిల్లా:  పోతుగంటి రాములు    (కొల్లాపూర్, నాగర్‌కర్నూలు), బి.శ్రీనివాస్‌ యాదవ్‌ (అచ్చంపేట, కల్వకుర్తి), ఎండి ఇషాక్‌ ఇంతియాజ్‌    (నారాయణపేట, మక్తల్‌), అందె బాబయ్య (కొడంగల్, మహబూబ్‌నగర్‌), వాల్యా నాయక్‌ (దేవరకద్ర, వనపర్తి), చాడ కిషన్‌రెడ్డి (షాద్‌నగర్, జడ్చర్ల), లింగంపల్లి కిషన్‌రావు (ఆలంపూర్, గద్వాల), 
మెదక్‌ జిల్లా: వేలేటి రాధాకృష్ణశర్మ (సిద్దిపేట, దుబ్బాక), గ్యాదరి బాలమల్లు (గజ్వేల్, నర్సాపూర్‌), చాగన్ల నరేంద్రనాథ్‌ (మెదక్, అందోలు), శేరి సుభాష్‌రెడ్డి (పటాన్‌చెరు, సంగారెడ్డి), ఎండీ ఫరీదుద్దిన్‌ (జహీరాబాద్, నారాయణఖేడ్‌), 
నల్లగొండ జిల్లా: తక్కల్లపల్లి రవీందర్‌రావు (నల్లగొండ, నకిరేకల్‌), కర్నె ప్రభాకర్‌ (ఆలేరు, భువనగిరి), కంచెర్ల రామకృష్ణారెడ్డి (మునుగోడు, దేవరకొండ), బడుగు లింగయ్య యాదవ్‌ (తుంగతుర్తి, సూర్యాపేట), ఎర్నేని వెంకటరత్నం (నాగార్జునసాగర్, మిర్యాలగూడ), వై.వెంకటేశ్వర్లు (కోదాడ, హుజూర్‌నగర్‌), 
నిజామాబాద్‌ జిల్లా: ఫారూక్‌ హుస్సేన్‌ (నిజామాబాద్‌ అర్బన్, బోధన్‌), లోక బాపురెడ్డి (బాల్కొండ, ఆర్మూరు), తుల ఉమ (నిజామాబాద్‌ రూరల్‌), దాదన్నగారి విఠల్‌రావు (బాన్సువాడ, జుక్కల్‌), వి.గంగాధర్‌గౌడ్‌ (ఎల్లారెడ్డి, కామారెడ్డి) 
వరంగల్‌ జిల్లా: సత్యవతి రాథోడ్‌ (నర్సంపేట, పాకాల), బండ ప్రకాశ్‌ (భూపాలపల్లి, ములుగు), బి.వెంకటేశ్వర్లు (మహబూబాబాద్, డోర్నకల్‌), మందుల సామేల్‌ (పాలకుర్తి, జనగామ), మెట్టు శ్రీనివాస్‌ (వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు), ఎడవెల్లి కృష్ణారెడ్డి (స్టేషన్‌ఘనపూర్, వర్ధన్నపేట), 
రంగారెడ్డి జిల్లా:   శంభీపూర్‌ రాజు (మేడ్చల్‌), జోగినపల్లి సంతోష్‌ (కుత్బుల్లాపూర్‌), కావేటి లక్ష్మీనారా యణ ఇబ్రహీంపట్నం), సోమ భరత్‌ కుమార్‌ (మహేశ్వరం), గౌండ్ల నాగేందర్‌గౌడ్‌ (రాజేంద్రనగర్‌), మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి (వికారాబాద్, చేవెళ్ల), గట్టు రాంచందర్‌రావు (పరిగి, తాండూరు).

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top