అడవిలో 12 కిలోమీటర్లు నడిచిన కలెక్టర్లు

అడవిలో 12 కిలోమీటర్లు నడిచిన కలెక్టర్లు


మహబూబాబాద్‌:  వరంగల్ అర్బన్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు ఆమ్రపాలి, ప్రీతిమీనాలు ఆటవిడుపు కోసం బయ్యారం అడవుల్లో కాలి నడకన ప్రయాణించారు. దాదాపు 12 కిలోమీటర్ల పాటు అడవిలో నడిచిన ఇరువురు అధికారులు అడవిలో ఉన్న చెరువును సందర్శించారు.అనంతరం పక్కనే ఉన్న పెద్ద గుట్ట ఇనుప ఖనిజం టూరిజం ప్రాంతాన్ని చూశారు. కలెక్టర్లు ఇద్దరూ ఉల్లాసంగా ఉత్సాహంగా నడుస్తూ ఉంటే.. వారితో పాటు నడవలేక మిగిలిన అధికారులు ఆపసోపాలు పడ్డారు.


 Back to Top