‘నా జీతంతో పేదలకు పింఛన్లు ఇస్తా’

I Will Give Pinchans With My Salary Said By Sanga Reddy Congress MLA Jagga Reddy - Sakshi

సంగారెడ్డి: ఎప్పుడూ ఏదే ఒక విషయంతో వార్తల్లో ఉండే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతం రూ.3 లక్షలకు మరో రూ.2 లక్షలు కలిపి వృద్ధులకు పంపిణీ చేస్తానని మంగళవారం విలేకరులకు తెలియజేశారు. నెలకు రూ.500 చొప్పున వెయ్యి మంది పేద ప్రజలకు పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తానని మాట ఇచ్చారు. ప్రతీ నెల 10వ తేదీన తన ఇంటి వద్దే నగదు ఇస్తానని వెల్లడించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిర్ణయం పట్ల కాంగ్రెస్‌ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top