హైదరాబాద్‌లో కుండపోత వర్షం

Heavy Rain Lashes Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో బుధవారం మధ్యాహ్నం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లి, మూసాపేట, జేఎన్‌టీయూ, ప్రగతినగర్‌, ఉప్పల్‌, నాగోల్‌, ఈసీఐఎల్‌, చిక్కడపల్లి, బాలానగర్‌లో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలోకి కూడా భారీగా వర్షపు నీరు చేరింది. (టమాట @ 70)

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. మధ్యాహ్నం మూడు గంటల వరకు సంగారెడ్డి జిల్లా అన్నసాగర్‌లో 15.3 సెం.మీ, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 12 సెం.మీ, కామారెడ్డి జిల్లా సోమూర్‌లో 10.6 సెం.మీ, భద్రాద్రి జిల్లా సీతారామపట్నంలో 9.6 సెం.మీ, మేడ్చల్‌ జిల్లా బాలానగర్‌లో 8.7 సెం.మీ, సంగారెడ్డి జిల్లా కాంగెటిలో 8.7 సెం.మీ, కామారెడ్డి బిచుకుందా 8.6 సెం.మీల వర్షపాతం నమోదైంది. (తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top