హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

Heavy Rain In Hyderabad City - Sakshi

హైదరాబాద్‌: నగరంలో పలుచోట్ల బుధవారం ఉదయం భారీ వర్షం కురుసింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్‌ జాం అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసిఫ్‌నగర్‌లో 9.3, సర్దార్‌ మహల్‌లో 8.7, జూపార్క్‌లో 7.3, గోల్కొండలో 7.2, మాదాపూర్‌లో 6.6, సెంట్రల్‌ యూనివర్సిటీలో 5.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాజేంద్రనగర్‌ పరిధిలో పలుచోట్ల ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది.

బండ్లగూడలోని వినాయకనగర్‌ కాలనీ, బేగంబజార్‌లో రోడ్లు జలమయం అయ్యాయి. దుకాణాల్లోకి వర్షపు నీరు చేరడంతో దుకాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం భారీగా పడుతుండటంతో జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాలు అప్రమత్తమయ్యాయి.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top