హైదరాబాద్‌లో భారీ వర్షం

Heavy Rain In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భాగ్యనగరంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లోని రోడ్లన్ని జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చిచేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, మెహదీపట్నం, భేగంపేట, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శేరిలింగంపల్లిలో 12.3 సెం.మీ, ఖైరతాబాద్‌లో 8.6 సెం.మీల వర్షపాతం నమోదైంది.

అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో భారీ వర్షం కురవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని వర్షాకాల ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్స్‌ రెస్క్యు బృందాలను అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లోని ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసర  పరిస్థితుల్లో 100కి ఫోన్‌ చేయాలని కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top