హైదరాబాద్‌లో కుండపోత వర్షం

Heavy Rain Hits Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, మలక్‌పేట, కూకట్‌పల్లి, మూసాపేట, బాలానగర్‌, కోఠి, కొండాపూర్‌, మాదాపూర్‌లలో కుండపోతగా వర్షం పడుతోంది. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో.. పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గంటన్నర నుంచి వర్షం కుండపోతగా కురుస్తుండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు. డీఆర్‌ఎఫ్‌ బృందాలను అధికారులు అలర్ట్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top