ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం

The health of Telangana is the goal of the government - Sakshi

ఖమ్మంమయూరిసెంటర్‌: ఆరోగ్య తెలంగాణనే ప్రభుత్వ లక్ష్యమని ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఎంపీ క్యాంపు కార్యాలయంలో పలువురు బాధితులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకతీతంగా ఆర్థిక చేయూతనందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను వీలైనంత త్వరగా బాధిత రోగి బ్యాంక్‌ ఖాతాలో వేసి నిధులు సద్వినియోగపరుచుకోవాలన్నారు. చెక్కులు అందుకున్నవారిలో వైరా మండల కేంద్రానికి చెందిన టి.రంగయ్య రూ.2లక్షలు, గార్ల మండలం బంగ్లాతండాకు చెందిన జి.చిన్ను రూ.లక్ష, కల్లూరు మండలం కొర్లగూడెంకు చెందిన యు.మాదురి రూ.26వేలు, ఖమ్మం రోటరీనగర్‌కు చెందిన ఎస్‌.నాగబాబు రూ.16వేలు, నేలకొండపల్లి మం డల కేంద్రానికి చెందిన జి.నర్సయ్య రూ.60వేలు, ములకలపల్లి మండలం రాజ్‌పేటకు చెందిన వి.రజిని రూ.60వేలు, జూలూరుపాడు మండలం మాచినేనిపేట గ్రామానికి చెందిన ఎస్‌.దేవి రూ.20వేలు, తల్లాడ మండలం ముద్దునూరు గ్రామానికి చెందిన టి.పిచ్చమ్మ రూ.16వేలు, బోనకల్‌కు చెందిన షేక్‌.షరీఫ్‌ రూ.26వేలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా వారంతా సీఎం సహాయ నిధికి తమ పేర్లను సిఫారసు చేసిన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యఖ్రమంలో కొత్తగూడెం గ్రంథాలయ చైర్మన్‌ దిండిగల రాజేం దర్, టీఆర్‌ఎస్‌ నాయకులు లింగాల కమల్‌రాజు, బొర్రా రాజశేఖర్, మద్దిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వెంకటకృష్ణ, చింతనిప్పు కృష్ణచైతన్య, కేవీ. రత్నం, లేళ్ల వెంకటరెడ్డి, కొణిజర్ల జెడ్పీటీసీ తేజావత్‌ సోమ్ల, ములకలపల్లి ఎంపీపీ కుర్సం శాంతమ్మ, వైఎస్‌ ఎంపీపీ గోలి రమణమ్మ, చింతకాని మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ కిలారు మనోహర్, ఎంపీటీసీ పున్నమ్మ, తేజావత్‌ నరసింహారావు, కేవీ.చారి, ఉమ్మినేని కృష్ణ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top