రైతును రాజుగా చూడాలి 

 Harish Rao inaugurates integrated market yard in Siddipet - Sakshi

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు 

సాక్షి, సిద్దిపేట: రైతును రాజుగా చూడాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్యేయమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.  ప్రజల ముంగిటికే మార్కెట్‌ సేవలు తీసుకురావాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సిద్దిపేటలో సమీకృత మార్కెట్, టాస్క్‌ఫోర్స్, పోలీస్‌ వెల్ఫేర్‌ కేంద్రాలు, గోదాంలను మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌తో కలసి   బుధవారం ప్రారంభించారు.  హరీశ్‌రావు మాట్లాడుతూ వ్యవసాయంతోపాటు, అను బంధరంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రభు త్వం చేయూతనిస్తుందని చెప్పారు. మాంసం ఉత్పత్తులు పెంచేందుకు సబ్సిడీ గొర్రెల పంపిణీ, చేపల ఉత్పత్తిని పెంచేందుకు ఉచి తంగా చేప పిల్లలను సరఫరా చేస్తున్నామని అన్నారు.

కూరగాయలు, పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహకాలను అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. అయితే, ఉత్పత్తులు పెంచడమే కాకుండా వాటిని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో సమీకృత మార్కెట్‌ల నిర్మాణాలు చేపడుతున్నామని వెల్లడించారు. ఈ మార్కెట్‌ల ద్వారా రైతుకు, వినియోగదారునికి ఉపయోగకరంగా, లాభదాయకంగా ఉంటుం దని చెప్పారు. వేగంగా పనులు జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ప్రతి చెరువు నిండుకుండలా మారుతుందని, తద్వారా చేపల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతుందని అన్నారు. తెలంగాణ పల్లెల్లో పూర్వ వైభవం రావ డం, స్థిరమైన ఆర్థిక పరిపుష్టి కలిగేందుకు ఎంతో కాలం పట్టదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top