అంధ విద్యార్థికి అండగా హరీశ్‌

Harish Rao Helping Hand to the Blind Student - Sakshi

ఉన్నత చదువుల కోసం రూ. లక్ష సాయం చేస్తానని హామీ  

పదిలో 10జీపీఏ సాధించిన తొలి అంధుడు లక్కీమీరానీ 

సిద్దిపేటజోన్‌: పదవ తరగతిలో 10/10 జీపీఏ సాధించిన అంధ విద్యార్థి లక్కీమీరానీకి ఎమ్మెల్యే హరీశ్‌రావు అండగా నిలిచారు. ఉన్నత విద్య కోసం తన వంతు సహాయంగా రూ.లక్ష నగదును అందిస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్‌కు చెందిన లక్కీమీరానీ 2వ తరగతి నుండే అంధుడు. తన లక్ష్యానికి అంధత్వం అడ్డుగా మారింది. ఈ క్రమంలో కరీంనగర్‌లోని పారమిత గ్రూప్స్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ చైర్మన్‌ డా. ప్రసాద్‌ అంధ విద్యార్థి లక్కీమీరానీ ప్రతిభను గుర్తించి ఆర్థిక స్తోమత, స్థితిగతులను పరిశీలించి అక్కున చేర్చుకున్నాడు.

రెండో తరగతి నుంచి 10 వ తరగతి వరకు అంధ విద్యార్థికి ఉచిత విద్యను అందించారు. ఇటీవల పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో లక్కీమీరానీ 10/10 జీపీఏ సాధించి ఆసియా ఖండంలోనే మొదటి అంధ విద్యార్థిగా నిలిచాడు. ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని తెలుసుకున్న హరీశ్‌రావు సోమవారం సిద్దిపేటలో అంధ విద్యార్థిని ఘనంగా సన్మానించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top