పకడ్బందీగా అచ్చంపేట ఎన్నికలు

పకడ్బందీగా అచ్చంపేట ఎన్నికలు - Sakshi


20వార్డుల్లో.. 20 పోలింగ్ స్టేషన్లు

11మంది ఎస్‌ఐలు, 20మంది ఏఎస్‌ఐ,

64మంది పీసీలు, 18మంది మహిళా పీసీలు

పరిశీలించిన కలెక్టర్ టీకే శ్రీదేవి


 

 

అచ్చంపేట :  అచ్చంపేట నగరపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. శుక్రవారం అచ్చంపేట ఏయూపీఎస్‌లోని పోలింగ్ కేంద్రం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కోసం ఏర్పాటు చేసే స్థలం, స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ పర్యవేక్షించారు. అనంతరం అటవీశాఖ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నోటిఫికేషన్ విడుదల కంటే ముందు ఏర్పాట్లు చేశామన్నారు. 20 వార్డుల్లో 18,614 మంది ఓటర్లుండగా 20 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, ఇందు కోసం 4రూట్లు రూపొందించడం జరిగిందన్నారు. ఈవీఎం ద్వారా ఓటింగ్ జరుగుతుందని వాటి పరిశీలన చేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు రాకుండా టెక్నికల్ సపోర్టు తీసుకుంటామని, ఎక్కడైనా మోరాయించిన వాటి స్థానంలో మరొకటి ఏర్పాటు చేసేం దుకు అదనంగా 5 ఈవీఎంలు ఉంటాయని చెప్పా రు. భవిత భవనంలో స్ట్రాంగ్‌రూమ్ ఏర్పాటు చేస్తామని, ఎమ్మార్సీ భవనంలో కౌంటింగ్ ఏర్పాట్లు ఉంటాయని కలెక్టర్ చెప్పారు.



మొత్తం మూడు టేబుల్స్ ఏర్పాటు చేసి 7 రౌండ్లు ఒకేసారి జరుగుతాయన్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో పీఓ, ఏపీఓతో పాటు ముగ్గురు పోలింగ్ క్లర్కులు ఉంటారని చెప్పారు. ఎన్నికల కమిషనర్ నిబంధనల మేరకు నాగర్‌కర్నూల్ డివిజన్ నుంచి కాకుండా మహబూబ్‌నగర్ డివిజన్‌కు చెందిన ఏజీటీ ఉపాధ్యాయులను వినియోగించు కుంటున్నామని ఈ డివిజన్‌లో స్థానికులను కూడా తీసుకోలేదని అన్నారు. 11మంది ఎస్‌ఐలు, 20 మంది ఏఎస్‌ఐలు, 64 మంది పీసీలు, 20 మంది హోంగార్డులు, 18 మంది మహిళా పీసీలు, హెచ్‌సీలు ఉంటారని చెప్పారు. పట్టణంలో పది సమస్యాత్మక, అతిసమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారని, రెండు స్పెషల్ పార్టీ టీంలు, రెండు వాహన తనిఖీ బృందాలు పనిచేస్తాయని, 6 తనిఖీ కేంద్రా లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.



ఎన్నికల సిబ్బందికి ఈ నెల 27న, మార్చి 1న అచ్చంపేట ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణలు ఉంటాయని చెప్పారు. 4 రూట్ మొబై ల్స్, ఒక డీఎస్పీ ఉంటారని, ఎన్నికల పరిశీల కులుగా సీఆర్‌డీ బాలమాయదేవి(ఐఏఎస్)ను నియమించారని, గురువారం వారు పరిశీలన చేసి వెళ్లారన్నారు. వెబ్‌కాస్టింగ్, వీడియో, మైక్రోలేవల్స్ ఏర్పాట్లు ఉంటాయన్నారు. ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top