యూనివర్సిటీల పటిష్టతపై గవర్నర్‌ దృష్టి

యూనివర్సిటీల పటిష్టతపై గవర్నర్‌ దృష్టి


అక్టోబర్‌ 6న వీసీలతో భేటీ  సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ వర్సిటీల పటిష్టతపై గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ దృష్టి సారించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్‌ చాన్స్‌లర్లను నియమించిన తరువాత తొలిసారిగా వీసీలతో అక్టోబర్‌ 6న సమావేశం కానున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఈ సమావేశం జరగనుంది. ఇటీవల ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి తదితరులతో భేటీ అయిన గవర్నర్‌.. వర్సిటీ చాన్స్‌లర్‌ హోదాలో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు.ఈ సమావేశంలో యూనివర్సిటీల పటిష్టత, నాణ్యతా ప్రమాణాల పెంపు అంశాలపైనే ప్రధాన దృష్టి సారించ నున్నారు. వర్సిటీల్లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించి, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. 

Back to Top