కట్టడి ఇలా!

Full Security in Hyderabad Containment Places - Sakshi

కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

ఆ ప్రాంతాల నుంచి బయటకు.. లోపలకు బంద్‌

బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకల నిలిపివేత

24 గంటల పాటు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ

ఇంటింటికీ అవగాహన కల్పిస్తూ.. కరపత్రాల అందజేత

సమన్వయంతో పనిచేస్తున్న ఆయా శాఖల అధికారులు

ఫోన్‌ చేస్తే ఇళ్ల వద్దకే నిత్యావసరాలు

మాస్కులు, గ్లౌజులు ధరించి ఇంటింటి సర్వే

అందుబాటులో పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు

కిట్లు ధరించి లక్షణాలు ఉన్న వ్యక్తుల ఆస్పత్రికి తరలింపు

కాంటాక్ట్‌ హిస్టరీ ఉన్నవారిపై ప్రత్యేక నిఘా

కంటైన్మెంట్‌ జోన్లలో పోలీస్‌ ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.  ఆ ప్రాంతాలకు రాకపోకలను నిషేధించి కాలనీలకు వెళ్లే రహదారులను మూసేశారు. చీమచిటుక్కుమన్నా అలర్ట్‌ అవుతున్నారు.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు. కంచె దాటి బయటకు వెళ్లకుండా 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు. ఇళ్ల వద్దకే నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.. అన్ని ఇళ్లలోని వారికి ఫోన్‌ నంబర్లను అందుబాటులో ఉంచి.. ఏ అవసరం ఉన్నా క్షణాల్లో స్పందిస్తున్నారు.. సిబ్బంది మాస్కులు, గ్లౌజులు ధరించి ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు.. గతంలో పాజిటివ్‌ వచ్చిన వారి బంధువులు, సన్నిహితుల వివరాలను సేకరిస్తున్నారు. దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పీపీఈ కిట్లు ధరించి ఆస్పత్రులకు తరలిస్తున్నారు.  సోడియం క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.  ఈజోన్లను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవే„ì స్తున్నారు.

కంటైన్మెంట్‌ జోన్‌ నుంచి బయటకు రావాలన్నా.. బయట నుంచి లోపలకు వెళ్లాలన్నా కుదరదు. ఆ ప్రాంతానికి వెళ్లే అన్ని దారులు మూసివేయడంతో పాటు ప్రతి కదలికను పోలీసులు గమనిస్తుంటారు. ఏదైనా అత్యవసరం అయితే సంబంధిత అధికారులకు ఫోన్‌ చేయాల్సిందే.. నిత్యావసరాలు కావాలన్నా ఇళ్ల వద్దకే సరఫరా చేస్తారు. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తుండగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలు వారికి సహకరిస్తున్నారు. సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి గతంలో పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారితో క్లోజ్‌ కాంటాక్ట్‌ వివరాలు సేకరిస్తున్నారు. 24 గంటల పాటు ఆయా ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. కంటైన్మెంట్‌ జోన్ల పరిస్థితిపై సాక్షి బుధవారం సర్వే నిర్వహించింది.   

కుత్బుల్లాపూర్‌: నియోజకవర్గంలో కోవిడ్‌–19 చాపకింద నీరులా విస్తరిస్తోంది. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నప్పటికీ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతూనే ఉంది. ముఖ్యంగా క్లోజడ్‌ కాంటాక్ట్‌ ఉన్న వారి నుంచే ఈ వ్యాధి వ్యాపిస్తుంది. గతంలో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో 2,3 మాత్రమే పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ప్రస్తుతం ఆ సంఖ్య 15కు చేరింది. మంగళవారం ఒక్క రోజే నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదు కావడం కలకలం రేపుతుంది. ఇప్పటి వరకు చంద్రగిరినగర్‌లో 5, సుభాష్‌నగర్‌లో 1, ఎస్‌ఆర్‌ నాయక్‌నగర్‌లో 1, అపురూపకాలనీలో 1, ప్రగతినగర్‌లో 2 కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ సభకు వెళ్లిన సుభాష్‌నగర్‌కు చెందిన వ్యక్తితో క్లోజడ్‌ కాంటాక్ట్‌ ఉన్న కళావతినగర్‌కు చెందిన ఓ వ్యక్తికి సైతం వైరస్‌ సోకింది. అతన్ని ఐసోలేషన్‌ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు పరిక్షలు నిర్వహించగా నలుగురికి సైతం పాజిటీవ్‌గా తేలడంతో వారిని సైతం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా ఆయా ప్రాంతాల్లో పాజిటీవ్‌ వచ్చిన వారితో పాటు కుటుంబ సభ్యులు, చుట్టు ప్రక్కల వారిని పరిక్షించే సమయంలో వైద్య సిబ్బంది వద్ద కనీసం పిపిఈ కిట్లు, ఎన్‌–95 మాస్కులు కూడా అందుబాటులో లేవు. కేవలం సాధారణ మార్కులతోనే వైద్యాధికారులు పని చేస్తున్నారు. ఇప్పటికే పై ప్రాంతాలను కంటైన్మెంట్, క్లస్టర్‌ ప్రాంతాలుగా గుర్తించగా బుధవారం నుంచి కళావతినగర్‌ను సైతం దిగ్బందం చేయనున్నారు. 24 మంది ఏఎన్‌ఎం లు 12 బృందాలుగా విడిపోయి ఇంటింటి సర్వే చేస్తు వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే వారిని 108లో గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. దాదాపుగా 8000 వేల గృహాలను సర్వే చేశారు. పాజిటీవ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో చుట్టూ ఉన్న వంద ఇళ్లను కట్టడి చేసి రాకపోకలను నిషేదించారు. వారికి కావాల్సిన నిత్యవసరాలను అధికారులే అందజేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.  

అన్నిదారులు మూసేసి..
దిల్‌సుఖ్‌నగర్‌: మలక్‌పేట్‌ సర్కిల్‌ పరిధిలో 10 ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. ఓల్డ్‌ మలక్‌పేట వాహెద్‌నగర్, చంచల్‌గూడ, జీవన్‌యార్‌ జంగ్‌కాలనీ, సపోటాబాగ్‌ కాలనీ, కాలడేరా, ప్రొఫెసర్స్‌ కాలనీ, గుడ్డిబౌలి, సుల్తాన్‌ డేరా, అస్మాన్‌ఘాడ్, రేస్‌కోర్స్‌ రోడ్‌ సమీప ప్రాంతాలను పూర్తిగా మూసేశారు.  
కంటైన్మెంట్‌ జోన్లలో అధికారులతో ఇంటింటి సర్వే చేయిస్తున్నారు.
పోలీసులు ఈ ప్రాంతంలోకి ఎవ్వరినీ రానివ్వడం లేదు.  
ఇంటింటికీ సర్వే నిర్వహిస్తున్నారు.  
ఇప్పటి వరకు 80 శాతం సర్వే పూర్తి  
సిబ్బంది ఎన్‌ 95 మాస్కులను ధరిస్తున్నారు.  
పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయి.  
థర్డ్‌ కాంటాక్ట్‌ లక్షణాలు ఎవరికీ కనిపించలేదు.
అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.
ఉదయం, సాయంత్రం అధికారులు రసాయనాలను స్ప్రే చేయిస్తున్నారు.  

కంటైన్‌మెంట్‌ జోన్లలో పూర్తి భద్రత
కూకట్‌పల్లి: కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో 6 కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేశారు. ఇందులో పీవీఆర్‌ రెసిడెన్సీ వసంత్‌నగర్‌కాలనీ, భగత్‌సింగ్‌నగర్‌ కేపీహెచ్‌బీ, బాలాజీనగర్, హస్మత్‌పేట్, ఓల్డ్‌ బోయిన్‌పల్లి, ఎల్లమ్మబండ ప్రాంతాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేశారు. పాజిటివ్‌ కేసులు వచ్చిన ఈ ప్రాంతాల్లో ఇళ్లకు రాకపోకలు బంద్‌ చేయించారు. ఈ కస్టర్లలో నివాసం ఉండే వారు 28వ తేదీ వరకు బయటకు వచ్చే అవకాశం లేదు. వీరికి ఏ వస్తువులు కావాల్సినా జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక టీమ్‌లు వీరికి సరఫరా చేయనున్నారు. ఈ టీములు పూర్తిస్థాయిలో మాస్క్‌లు, గ్లౌజులు, పూర్తి భద్రతతో వారికి 24 గంటల పాటు మూడు షిఫ్టులుగా సేవలు అందిస్తున్నారు. డీఎంహెచ్‌ఓకు సంబంధించిన హెల్త్‌ టీమ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఆరు జోన్లలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇప్పటి వరకు కూకట్‌పల్లి ప్రాంతంలో మొదట వచ్చిన పాజిటివ్‌ కేసులు మినహా కొత్త కేసులు రాలేదు. అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

రాంగోపాల్‌పేటలో నో థర్డ్‌ కాంటాక్ట్‌  
కుత్బుల్లాపూర్‌లో 8 వేల ఇళ్ల సర్వే
అబిడ్స్‌లో కరపత్రాలతో అవగాహన
గచ్చిబౌలిలో ఇళ్ల నుంచి రాకుండా చర్యలు
చార్మినార్‌లో అనుమానితులకు పరీక్షలు
కూకట్‌పల్లిలో మూడు షిఫ్టుల్లో విధులు
జూబ్లీహిల్స్‌లో శానిటైజ్‌ తర్వాతే నిత్యావసరాలు
అల్వాల్‌లో ఇళ్లకే నిత్యావసరాల పంపిణీ
ముషీరాబాద్‌లో వలసకూలీలకు వసతి
చిలకలగూడలో నిత్యం అధికారుల పర్యటన
దిల్‌సుఖ్‌నగర్‌లో 80 శాతం సర్వే పూర్తి

రహమత్‌నగర్‌: జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–19లో కరోనా నియంత్రించడంతో అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించిన అధికారులు రాజీవ్‌నగర్, బోరబండ సైట్‌–3, జయంతినగర్, వెంకటగిరికి చెందిన నలుగురికి పాజిటివ్‌ రావడం, వీరి ద్వారా మరో 9 మందికి పాజిటివ్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్‌ వచ్చిన వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక వారు నివాసం ఉంటున్న రాజీవ్‌నగర్, జయంతినగర్, వెంకటగిరి, సైట్‌ 3 ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేశారు. ఒక్కో జోన్‌కు ఒక నోడల్‌ అధికారితో పాటు 10 మంది వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. బయట వ్యక్తులను, లోపలి వ్యక్తులను బయటకు రానివ్వడం లేదు. శానిటైజ్‌ చేసిన తర్వాతే నిత్యావసరాలను ఇళ్లకు పంపిస్తున్నారు. పోలీసులు ఆ ప్రాంతాలను పర్యావేక్షిస్తున్నారు.

కొనసాగుతున్న సర్వే..
చార్మినార్‌/యాకుత్‌పురా:  జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ జోన్‌ పరిధిలోని సర్కిల్‌–6, 7, 8, 9, 10లలోని కంటై న్మెంట్‌ జోన్లలో సర్వే కొనసాగుతోంది. ప్రతిరోజు 400 ఇళ్లలో సర్వే నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లో బారికేడ్లను రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. పాజిటివ్‌ కేసులు వచ్చిన కుటుంబ సభ్యులతో పాటు వారు కలిసిన వారిని ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు 1800 ఇళ్లలో సర్వే చేసి అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. వైద్య సిబ్బంది మాస్కులు, గ్లౌజ్‌లు ధరించి వివరాలను సేకరిస్తున్నారు. పాజిటివ్‌ కేసు వచ్చిన వారిని తరలించేందుకు అవసరమైన పీపీఈ కిట్లను అందుబాటులో ఉంచారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో వారి బంధువులతో పాటు సన్నిహితులపై ఆరా తీస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన 24 మందిని      గాంధీలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి 28 మందిని చార్మినార్‌ నిజామియా జనరల్‌ ఆస్పత్రిలో క్వారంటైన్‌లో ఉంచారు. కాంటాక్ట్‌ హిస్టరీ ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఎలాంటి హిస్టరీ లేని వారికి వైరస్‌ లక్షణాలు కనిపించలేదు. ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ, పోలీసులు, వైద్యాధికారులు పర్యవేక్షిస్తూ కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో సోడియం క్లోరైడ్‌ స్ప్రే పిచికారీ చేస్తున్నారు.  

శానిటైజ్‌ చేసిన తర్వాతే నిత్యావసరాలు
కూకట్‌పల్లి: కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో 6 కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేశారు. ఇందులో పీవీఆర్‌ రెసిడెన్సీ వసంత్‌నగర్‌కాలనీ, భగత్‌సింగ్‌నగర్‌ కేపీహెచ్‌బీ, బాలాజీనగర్, హస్మత్‌పేట్, ఓల్డ్‌ బోయిన్‌పల్లి, ఎల్లమ్మబండ ప్రాంతాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేశారు. పాజిటివ్‌ కేసులు వచ్చిన ఈ ప్రాంతాల్లో ఇళ్లకు రాకపోకలు బంద్‌ చేయించారు. ఈ కస్టర్లలో నివాసం ఉండే వారు 28వ తేదీ వరకు బయటకు వచ్చే అవకాశం లేదు. వీరికి ఏ వస్తువులు కావాల్సినా జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక టీమ్‌లు వీరికి సరఫరా చేయనున్నారు. ఈ టీములు పూర్తిస్థాయిలో మాస్క్‌లు, గ్లౌజులు, పూర్తి భద్రతతో వారికి 24 గంటల పాటు మూడు షిఫ్టులుగా సేవలు అందిస్తున్నారు. డీఎంహెచ్‌ఓకు సంబంధించిన హెల్త్‌ టీమ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఆరు జోన్లలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇప్పటి వరకు కూకట్‌పల్లి ప్రాంతంలో మొదట వచ్చిన పాజిటివ్‌ కేసులు మినహా కొత్త కేసులు రాలేదు. అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

రహమత్‌నగర్‌: జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–19లో కరోనా నియంత్రించడంతో అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించిన అధికారులు రాజీవ్‌నగర్, బోరబండ సైట్‌–3, జయంతినగర్, వెంకటగిరికి చెందిన నలుగురికి పాజిటివ్‌ రావడం, వీరి ద్వారా మరో 9 మందికి పాజిటివ్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్‌ వచ్చిన వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక వారు నివాసం ఉంటున్న రాజీవ్‌నగర్, జయంతినగర్, వెంకటగిరి, సైట్‌ 3 ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేశారు. ఒక్కో జోన్‌కు ఒక నోడల్‌ అధికారితో పాటు 10 మంది వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. బయట వ్యక్తులను, లోపలి వ్యక్తులను బయటకు రానివ్వడం లేదు. శానిటైజ్‌ చేసిన తర్వాతే నిత్యావసరాలను ఇళ్లకు పంపిస్తున్నారు. పోలీసులు ఆ ప్రాంతాలను పర్యావేక్షిస్తున్నారు.

నో థర్డ్‌ కాంటాక్ట్‌ కేసులు
రాంగోపాల్‌పేట్‌:  రాంగోపాల్‌పేట్‌ను ఈ నెల 9వ తేదీ నుంచి కంటైన్‌మెంట్‌గా ప్రకటించి కఠినంగా అమలు చేస్తున్నారు. ఇంట్లో నుంచి ఏ ఒక్కరినీ బయటకు రాకుండా ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నారు. మొత్తం 1,550 ఇళ్లను ఈ కంటైన్‌మెంట్‌ కిందకు తీసుకువచ్చారు. ఎవరికైనా నిత్యావసర వస్తువులు అవసరం ఉన్నా అధికారులే తెప్పించి ఇస్తున్నారు. కానీ ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. ప్రతిరోజు రాపిడ్‌ ఫీవర్‌ సర్వే చేస్తున్నారు. ప్రతి ఇంటికీ మెడికల్‌ టీం వెళ్లి ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఉన్నాయా అని పరీక్షిస్తున్నారు. ఇంత వరకు ఎవరికీ అలాంటి లక్షణాలు బయటపడలేదు. సర్వే నిర్వహించే వైద్య సిబ్బంది ఎన్‌–95 మాస్కులు ధరించి సర్వే చేస్తున్నారు. ఇప్పటి వరకు థర్డ్‌ కాంటాక్టు లక్షణాలు ఇక్కడ బయటపడలేదు.  

వినూత్న ప్రచారం
అల్వాల్‌: అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలో ఐదు కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేశారు. కానాజిగూడ, (రాజీవ్‌గాంధీనగర్‌) మచ్చబొల్లారం, చంద్రపురి కాలనీ, జానకీనగర్, రాజీవ్‌ వీకర్‌ సెక్షన్‌ బస్తీల్లో వెలుగు చూసిన పాజిటివ్‌ కేసుల ఇళ్ల చుట్టు పక్కల నివాసాలను బ్లాక్‌ చేస్తూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి జోన్‌ వద్ద ముగ్గురు జీహెచ్‌ఎంసీ, ఇద్దరు పోలీసులు ఒక రెవెన్యూ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ జోన్‌ పరిధిలో ఉన్నవారికి నిత్యవసర వస్తువులకు వీళ్లే సరఫరా చేస్తున్నారు. అత్యవసర సేవలకు అనుమతి ఇస్తూ వారికిపై నిఘా పెడుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు మైక్‌ల ద్వారా హెచ్చరిస్తున్నారు.

2,200 ఇళ్ల సర్వే పూర్తి
గచ్చిబౌలి:  శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు 15 నమోదయ్యాయి. దీంతో 11 కాలనీలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. పాజిటివ్‌ కేసు నమోదైన పరిసర ప్రాంతాల్లో ఒక్కో కేసు పరిధిలో వెయ్యి ఇళ్లను ఇప్పటికే సర్వే చేశారు. ఎలాంటి కాంటాక్ట్‌ కేసు నమోదు కాలేదు. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో జ్వరం, జలుబు, దగ్గు ఉన్న వారి కోసం 22 బృందాలు సర్వే చేస్తున్నాయి. మంగళవారం 2,200 ఇళ్లను సర్వే చేయగా ఇంకా కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసు ఉన్న వీధి పూర్తిగా దిగ్గందం చేసి ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. రోడ్లపై బారీకేడ్లు అమర్చి చర్యలు తీసుకున్నారు. సర్వే చేస్తున్న సిబ్బందికి ఎన్‌–95 మాస్క్‌లు, గ్లౌస్‌లు అందజేశారు. అనుమానితులను ఆస్పత్రికి తరలించాల్సి వచ్చినప్పుడే పీపీఈ కిట్లు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ఎవరినీ ఆస్పత్రికి తరలించలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top