రు‘చి’రిత్ర...ఫుడ్‌వాక్స్‌

Food Walks in hyderabad - Sakshi

సింపుల్‌గా ఇరానీ చాయ్‌ని సిప్‌ చేసేస్తాం. మండీ బిర్యానీని ట్రెండీగా షేర్‌ చేసేసుకుంటాం. అయితే ఇలాంటి ట్రెడిషనల్‌ డిషెస్‌ని తినడంతో పాటు వాటి చరిత్ర వినడం కూడా అద్భుతమైన అనుభవమే అంటున్నారు సిటీలో ఫుడ్‌ వాక్స్‌ సృష్టికర్త అశీష్‌ నాయక్‌. ఆయన తన భాగస్వామి నిధితో కలిసి గత కొంత కాలంగా ఫుడ్‌ వాక్స్‌ నిర్వహిస్తున్నారు. దీనిలో నగరానికి చెందిన భోజన ప్రియులు హుషారుగా పాల్గొంటున్నారు. ఆయన పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే..

సాక్షి, సిటీబ్యూరో: చాలా కాలంగా ఫుడ్‌ లవర్‌ని. అంతకు మించి ఫుడ్‌ గురించి చర్చించడమంటే ఇషం. ఆ అభిరుచే ఫుడ్‌ కాలమిస్ట్‌గా మార్చింది. దినపత్రికలు, మేగ్‌జైన్స్‌కు  రుచులకు సంబంధించిన వ్యాసాలు రాస్తూ ఉంటాను. అయితే నిధి నాకన్నా ముందు నుంచే ఫుడ్‌ గురించి రాస్తోంది. మా ఇద్దరికీ ఉన్న ఆసక్తిని అదే స్థాయిలో అభిరుచి కలవారితో పంచుకోవాలనుకున్నాం. భోజనప్రియులతో కలిసి ఇష్టాఇష్టాలు పరస్పరం తెలియజేసుకోవాలనుకున్నాం.  ఆ ఆలోచనతోనే నేను నిధి కలిసి ఫుడ్‌ డ్రిఫ్టర్‌ బ్లాగ్‌ని ఆరేళ్ల క్రితం ప్రారంభించాం.  దీనిలో పర్యటనలతో పాటు ఫుడ్‌కి కూడా ప్రాధాన్యత ఇస్తూ నా అనుభవాలను రాస్తూంటాను. కనీసం నెలకు 3 నుంచి 4 ఆర్టికల్స్‌ అయినా తప్పకుండా రాస్తుంటాను. వీటిలో మా పర్యటనలతో పాటు మేం ఆస్వాదిస్తున్న రుచులూ ఉంటాయి. ఈ ఆర్టికల్స్‌ కోసం పూర్తి స్థాయి పరిశోధన చేసి మరీ రాస్తున్నాను.

నడక...రుచుల వెనుక...
హైదరాబాదీ ఫుడ్‌ గురించి చెప్పాల్సింది  చాలా ఉంది. బ్లాగర్‌గా  ఈ విషయం అనుభవమైంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఫుడ్‌ వాక్స్‌ను స్టార్ట్‌ చేశాం.  సిటీలో ఫుడ్‌ అంటే బిర్యానీ లేదా హలీమ్‌ మాత్రమే కాదు మరెన్నో అని తెలియజేయడం కోసమే ఈ ఫుడ్‌ వాక్స్‌. ఇక్కడివారితో పాటు ఇక్కడికి వచ్చేవారు కూడా బౌల్‌ ఆఫ్‌ మరాగ్, ది లాల్‌ చికెన్, దమ్‌ కా మర్గ్, ఇంకా ఇలాంటివెన్నో నగరానికి చెందిన అద్భుతమైన వంటకాలను రుచి చూడాలి. అంతేకాదు.. దీని ద్వారా చరిత్రను కూడా తెలుసుకోవచ్చు. చరిత్రకూ ఆహారానికి ఉన్న సంబంధాన్ని కూడా పరిశీలించవచ్చు. ప్రతి సంప్రదాయ రుచి వెనుకా ఒక కథ ఉంటుంది. దాన్ని తెలుసుకుంటూ ఆస్వాదిస్తే అది మరింత రుచికరంగా అనిపిస్తుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top