గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Fire Accident At Gandhi Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం ఆస్పత్రి మూడో అంతస్తులోని చిన్న పిల్లల వార్డులో ఈ ప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. తొలుత ఏసీల నుంచి పొగలు వచ్చాయి. మూడో అంతస్తులో దట్టంగా పొగలు వ్యాపించడంతో పేషెంట్లు, వారి బంధువులు ఆందోళన చెందారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top