అడవి ‘దేవుళ్ల పల్లి’

Fifty Pillers Temple In Adavidevulapally Nakgonda - Sakshi

కృష్ణాతీరంలో నెలవైన 50 స్తంభాల దేవాలయం

భక్తులను అలరిస్తున్న దేవతామూర్తులు ∙అరుదైన సూర్య దేవాలయం

సాక్షి, అడవిదేవులపల్లి (మిర్యాలగూడ): కృష్ణానది తీరంలోని అడవిదేవులపల్లి వద్ద ఉన్న చారిత్రాత్మకత, పురాణ చరిత్ర కల్గిన దేవాలయాలు భక్తులను అలరిస్తున్నాయి. ఎంతో చరిత్ర కల్గిన పురాతన దేవాలయాలు ఒకే చోట నెలవై ఉన్నాయి. అరుదైన శ్రీసూర్యదేవాలయం ఇక్కడే ఉండడం విశేషం. నిత్యపూజలు అందుకుంటున్న ఈ దేవాలయాలకు ప్రత్యేక దినాల్లో భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు.

ఆలయాల అడవిదేవులపల్లి..
కృష్ణానది పరవళ్లకు తోడు ప్రకృతి రమణీయత నడుమ అడవిదేవులపల్లి నదీ తీరంలో 50 స్తంభాలున్న అరుదైన దేవాలయాలున్నాయి. ఊరు సరిహద్దు ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో, ఊర్లోనూ అనేక దేవాలయాలు ఉండడంతో ఈ గ్రామానికి అడవిదేవులపల్లిగా పేర్కొంటారు. ఇక్కడ వైష్ణవ, శైవ మతానికి చెందిన రెండు రకాల దేవాలయాలుండడం అరుదైన విషయం. 

ఆలయాల చరిత్ర..
క్రీ.శ 1213లో కళ్యాణ చాణక్య రాజవంశానికి చెందిన త్రిభునవ మల్లదేవుడు అతని సామంతుడైన తొండయ చోడ మహారాజు కృష్ణానది ఒడ్డున 50 స్తంభాల దేవాలయాన్ని నిర్మించాడు. ఇక్కడ మహాలక్ష్మి, విష్ణువు, శివ, ఆంజనేయుడు, సోమేశ్వరుడు, అ య్యప్ప, తదితర దేవాలయాలతో పాటుగా శ్రీచెన్నకేశవ, అరుదైన శ్రీసూర్య దేవాలయాలు ఉన్నాయి. రాజుల కాలంలో ఈ దే వాలయాలు ఎంతో ఆదరణ పొందాయి. ప్రస్తుతం ఆలన పాలన లేక అవి శిథిలావస్థకు చేరాయి. అయితే గ్రామస్తుల ఉ మ్మడి కృషి ఫలితంగా 2005లో తిరి గి అన్ని దేవాలయాలు పునరుద్ధరణ జరిగి భక్తులను అలరిస్తున్నాయి.

పురాణ చరిత్ర..
ఈ దేవాలయాలకు ఎంతో పురాణ చరిత్ర ఉంది. త్రేతాయుగంలో తాటకి వధ కోసం విశ్వామిత్రుడు రామ, లక్ష్మణులను తీసుకెళ్తూ ఈనదీ తీరంలోకి వస్తాడు. ఇక్కడే నిద్రించిన అనంతరం సంధ్యాసమయంలో శ్రీరాముడు నదిలో పుణ్యస్నానం చేసిన అనంతరం పూజ చేసేందుకు శివలింగాన్ని స్వయంగా ప్రతిష్ఠించాడని ప్రసిద్ధి. దీంతో పాటుగా ఇక్కడే కాకాసుర వధ జరిగిందని మరొక పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అందుకనే ఇక్కడ కాకులు వాలవని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. 
కృష్ణానది తీరంలో దేవాలయాల ప్రాంగణం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top