కూతురును కడతేర్చిన తండ్రి

The Father Who Killed His Insane Daughter  - Sakshi

మతిస్థిమితం సరిగా లేదని, మాట వినడంలేదంటూ రోకలిబండతో దాడి

అక్కడికక్కడే దుర్మరణం

కల్వకోల్‌లో దారుణఘటన

పెద్దకొత్తపల్లి (కొల్లాపూర్‌): పిల్లల్ని కని పెంచి ఆలనా పాలనా చూసుకునే తండ్రే కూతురిపాలిట కాలయముడిగా మారాడు. మతిస్థిమితం లేదన్న కారణంతో తన కూతురును రోకలిబండతో తలపై కొట్టి చంపిన ఘటన మండలంలోని కల్వకోల్‌లో సోమవారం చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కల్వకోల్‌కి చెందిన కడ్తాల్‌ ఎర్రన్న కూతురు శ్యామల(32)కు పదేళ్ల క్రితం కోడేరుకు చెందిన శంకర్‌తో వివాహమైంది. వీరికి ఒక ఏడాది కూతురు ఉంది. శ్యామల ఏడాది నుంచి మతిస్థిమితం లేకుండా తిరగడంతో భర్త శంకర్‌ విడాకులు ఇచ్చాడు. శ్యామలను హైదరాబాద్‌లోని జిల్లెలగూడ చర్చిలో ఉంచారు. మూడు రోజల క్రితం శ్యామల కల్వకోల్‌కి వచ్చి గ్రామంలో తిరుగుతుండగా సోమవారం ఉదయం తండ్రి ఎర్రన్న శ్యామలను హైదరాబాద్‌లోని జిల్లెల గూడచర్చికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అందుకు శ్యామల నిరాకరించింది.

దీంతో కోపంతో ఎర్రన్న రోకలి బండతో కూతురు తలపై బాదడంతో శ్యామల అక్కడిక్కడే మృతి చెందింది. చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొల్లాపూర్‌ సీఐ వెంకట్‌రెడ్డి పెద్దకొత్తపల్లి ఎస్‌ఐ నరేష్‌ సంఘటన స్థలానికి వెళ్లి హత్యకు దారి తీసిన సంఘటనను పరిశీలించారు. మృతురాలి తమ్ముడు శ్యామ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు హెచ్‌కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. హత్య కేసులో నిందితుడైన ఎర్రన్నను అదుపులోకి తీసుకొని కొల్లాపూర్‌ కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top