6 కేటగిరీల పోస్టులకు అక్టోబర్‌లో పరీక్షలు

Examinations in October for 6 category posts - Sakshi

23, 24 తేదీల్లో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహణ: టీఎస్‌పీఎస్సీ

సాక్షి, హైదరాబాద్‌: వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఆరు కేటగిరీల పోస్టుల భర్తీకి వచ్చే నెల 23, 24 తేదీల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను (ఆన్‌లైన్‌) నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఆయా పరీక్షల పేపర్లు, పరీక్ష సమయాలతో కూడిన షెడ్యూలును జారీ చేసింది. పేపరు–1 జనరల్‌ స్టడీస్, జనరల్‌ ఎబిలిటీస్, పేపరు–2 సంబంధిత సబ్జెక్టులకు సంబంధించినవి ఉంటాయని పేర్కొంది.

పరీక్షల వివరాలు...
23–10–2017న: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌(స్పెషలిస్టు) పేపరు–1 ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు, పేపరు–2 అదేరోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. అలాగే డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పేపరు–1 పరీక్ష, ట్యూటర్స్‌ ఇన్‌ డీఎంఈ పేపరు–1, లెక్చరర్స్‌ ఇన్‌ రేడియోలాజికల్‌ ఫిజిక్స్, ఫిజిసిస్ట్‌ పేపరు–1, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసులో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పేపరు–1 పరీక్షలు అదే రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటాయి.

24–10–2017న: డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పేపరు–2 డెంటల్‌ సర్జరీ పరీక్ష ఉంటుంది. అలాగే ట్యూటర్స్‌ ఇన్‌ డీఎంఈ పేపరు–2, లెక్చరర్స్‌ ఇన్‌ రేడియోలాజికల్‌ ఫిజిక్స్‌ అండ్‌ ఫిజిసిస్ట్‌ పేపరు–2, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పేపరు–2 పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటాయి. అదేరోజు అసిస్టెంట్‌ ఫిజియోథెరపిస్ట్‌ పోస్టులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపరు–1 పరీక్ష, మధాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపరు–2 పరీక్షలు ఉంటాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top