చెల్లని రూపాయికి గీతలెక్కువ: ఈటల

Etela Rajender Press meet In Huzurabad Over Municipal elections - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురుతుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. జిల్లాలోని హుజురాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 32 జిల్లా పరిషత్తులు కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌ అదే తరహాలో మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధింస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ఎన్నికలంటే వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అందరిని కలుపుకుపోయే వారివే టికెట్లు లభిస్తాయని స్పష్టం చేశారు. కౌన్సిలర్ల అభిప్రాయం మేరకే చైర్మన్‌లను ఎన్నుకుంటామని పేర్కొన్నారు. భారతదేశం లౌకిక దేశమని, కుల మతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవించే ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదన్నారు. చెల్లని రూపాయికి గీతలెక్కువ అన్నట్లు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని విమర్శించారు. డబ్బులకు అమ్ముడుపోయే నాయకుడు ఎప్పుడూ రాజకీయాల్లో పైకిరారని హతవు పలికారు. నిబద్దత ఉన్న వాడే రాజకీయాల్లో పనిచేస్తాడని  అ‍న్నారు. రాజకీయాల్లో అవేశం పనికి రాదన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top