బ్యాలెట్‌ పేపరా?.. ఈవీఎమ్మా?

Election Commission Confuse in Mancherial Constituency - Sakshi

నిజామాబాద్‌లో అత్యధికంగా 242 నామినేషన్లు దాఖలు

ఎన్నికలంటేనే.. పాలన విధానాల రూపకల్పన కు సరైన వ్యక్తులను చట్టసభలకు పంపించటం. చట్టసభల్లో సమస్య పరిష్కారం కానప్పుడు..? నిరసన.. ఆ నిరసన వ్యక్తం చేయడానికి నిజామాబాద్‌ రైతులు నామినేషన్ల మార్గాన్ని ఎంచుకున్నారు. 1996లో నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారం కోసం 480 మంది నామినేషన్లు వేశారు. ప్రస్తుతం నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి జిల్లాకు చెందిన రైతులు 242 మంది నామినేషన్లు వేశారు. ఈ క్రమం లో ఈ ఎన్నికలను ఈవీఎం ద్వారా నిర్వహిస్తారా? లేక బ్యాలెట్‌ పేపర్‌ వినియోగిస్తారా? అనే సందేహం కలుగుతోంది. 16 మంది అభ్యర్థులకు నోటాతో కలి పి ఒక బ్యాలెట్‌ యూనిట్‌ (ఈవీఎం) చొప్పున విని యోగిస్తారు.

అంతకంటే ఎక్కువ మంది బరిలో ఉం టే మరో బ్యాలెట్‌ యూనిట్‌ను అనుసంధానిస్తారు. ఇలా 2006 నుంచి 2010 వరకు ఉన్న ఎం2 ఈవీ ఎంల్లో నాలుగింటిని అనుసంధానించడం ద్వారా 64 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ఈవీఎంల ద్వారానే పోలింగ్‌ నిర్వహించొచ్చు. 2013 తర్వాత ఎం3 ఈవీ ఎంలను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా నోటాతో కలిపి 384 మంది బరిలో ఉన్నా బ్యాలెటింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒక్కోదాంట్లో 16 చొప్పున 24 బ్యాలెటింగ్‌ యూనిట్లను అనుసంధానించడం 384 మందికి పోలింగ్‌ నిర్వహించవచ్చు. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని మోడకురిచి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,033 మంది పోటీ చేశారు. అప్పట్లో బ్యాలెట్‌ పేపర్‌ను బుక్‌లెట్‌గా ముద్రించాల్సి వచ్చింది. ప్రస్తుతం నిజామాబాద్‌లో ఎం3 ఈవీఎంలను వినియోగిస్తేనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. లేదంటే బ్యాలెట్‌ పేపరు ముద్రించాల్సిందే.– గుర్రాల మహేశ్, మంచిర్యాల డెస్క్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top