అయ్యా దండాలు..  అవ్వా దండాలు...

Election Candidates Attracting The Voters In Warangal  - Sakshi

కులసంఘాలను అక్కున చేర్చుకునే ప్రయత్నం

సాక్షి, వరంగల్‌: జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. రోజువారి ప్రచారం చేస్తూనే.. పనిలో పనిగా కులసంఘాలను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి.. రెండు ఇలా ఓట్లతో గెలిచిన నాయకులు చాలామంది ఉన్నారు. ప్రతి ఓటును ఓ వజ్రాయుధంగా అనుకుంటూ.. కనబడిన వారికల్లా అయ్యా దండాలు.. అవ్వా దండాలు అంటూ అభ్యర్థులు వంగి వంగి నమస్కరిస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులు ప్రతి ఓటరునూ ఆకర్షించేలా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల సమయంలో కులసంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నారు. కులసంఘాలతో సమావేశం ఎన్నికల నియమావళి పరిధిలోకి వస్తుండడంతో రాజకీయ పార్టీల నాయకుల్లో ఒకింత గుబులు మొదలైంది. జిల్లాల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు కులసంఘాలతో సమావేశాలను రద్దు చేసుకుని రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మీ హామీలన్నీ నెరవేరుస్తాం... ఎమ్మెల్యేగా గెలుపొందగానే.. అండగా ఉంటానంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. 

పెద్ది ‘స్వప్న’సాకారం కోసం..
నల్లబెల్లి: ముచ్చింపుల గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి స్వప్న

అవ్వా... సైకిల్‌... గుర్తుంచుకో..
హన్మకొండ: హన్మకొండ చోటే మజీద్‌ ప్రాంతంలో మహిళను ఓటు అభ్యర్థిస్తున్న టీడీపీ వరంగల్‌ పశ్చిమ అభ్యర్థి రేవూరి ప్రకాష్‌రెడ్డి 

కార్మికుడి బిడ్డగా.. కష్టాలు తీరుస్తా..
వరంగల్‌: కూరగాయల మార్కెట్‌లో కొత్తి మీర అమ్మి ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ వరంగల్‌ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్‌

దయన్నా... గెలుపు నీదే..!
పాలకుర్తి: మల్లంపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్‌ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు బొట్టుపెట్టి ఆశీర్వదిస్తున్న మహిళ 

పూల వర్షం..
భూపాలపల్లి : కొంపెల్లిలో ప్రచారంలో బతుకమ్మ ఎత్తుకున్న టీఆర్‌ఎస్‌ భూపాలపల్లి అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి

ముత్తిరెడ్డి కోలాటం
జనగామ: ఎల్లంలలో బోనాలు ఎత్తుకున్న మహిళలతో కోలాటం ఆడుతున్న టీఆర్‌ఎస్‌ జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top