కమల దళపతి ఎవరో?

Election of BJP District President In Nizamabad - Sakshi

బీజేపీలో సంస్థాగత ఎన్నికల సందడి కొనసాగుతోంది. పార్టీ మండల కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా జిల్లా కమిటీని ఎన్నుకోవాల్సి ఉంది. అయితే పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడి ఎన్నికపై ఆసక్తి నెలకొంది.

సాక్షి, కామారెడ్డి : భారతీయ జనతా పార్టీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో 22 మండలాలతో పాటు మూడు పట్టణ కమిటీలను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పందొమ్మిది కమిటీల ఎన్నికలు పూర్తయినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మరో ఆరు చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉంది. కామారెడ్డి నియోజక వర్గంలో నేతలు రెండు వర్గాలుగా చీలిపోయిన నేపథ్యంలో ఇక్కడ ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. అయితే జిల్లా కమిటీ ఎన్నికలు ఈ నెలలోనే పూర్తి చేయాల్సి ఉంది. అన్ని మండలాల కమిటీల ఏర్పాటు పూర్తయితేగానీ జిల్లా కమిటీ ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉండదు. ఈ నెలలోనే కచి్చతంగా జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో అన్ని మండలాల్లో కమిటీల ఎన్నికలు పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు.

రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు.. 
జిల్లాలో బీజేపీకి కొంత పట్టు ఉన్న కామారెడ్డి నియోజకవర్గంలో ఆ పార్టీ నేతల మధ్య తలెత్తిన విభేదాలు సమసిపోవడం లేదు. నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఎవరికి వారుగా కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఒక వర్గం, నియోజక వర్గ కార్యాలయంలో మరో వర్గం ప్రతినిధులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పారీ్టలు మెజారిటీ వార్డులను గెలుచుకునేందుకు క్షేత్ర స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. అయితే బీజేపీలో మాత్రం అంతర్గత కలహాలు ఆ పార్టీ శ్రేణులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. పార్టీ కామారెడ్డి నియోజక వర్గ బాధ్యుడిగా ఉన్న వెంకటరమణారెడ్డి తన అనుచరులతో కలిసి ఇటీవల పట్టణంలోని అన్ని వార్డుల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. వార్డుల్లో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు కదిలారు. వివిధ ఆందోళన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. అయితే మరో వర్గానికి చెందిన నేతలు వీరితో కలిసి పాల్గొనడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనూ రెండు వర్గాలు విభేదాలను పక్కనపెట్టకపోవడంతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.  

మరోసారి బాణాలకే అవకాశం.. 
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న బాణాల లక్ష్మారెడ్డికే మరోసారి పార్టీ పగ్గాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి జిల్లా అంతటా పర్యటించాల్సి ఉంటుంది. అయితే త్వరలో బల్దియా ఎన్నికలు ఉండడంతో నేతలు వాటిపైనే దృష్టి సారించారు. ఎవరూ జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో మరోసారి బాణాల లక్ష్మారెడ్డి చేతికే బీజేపీ జిల్లా అధ్యక్ష పగ్గాలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘విధులతో పాటు ఆరోగ్యమూ ముఖ్యమే’
నిజామాబాద్‌ లీగల్‌: విధుల నిర్వహణతో  సతమతమవుతున్న న్యాయ వాదులు ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని జిల్లా జడ్జి శ్రీసుధ అన్నారు. మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మెడికవర్‌ ఆసుపత్రి, శ్రీ నేత్రాలయం కంటి ఆసుపత్రిల సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని జడ్జి ప్రారంభించి మాట్లాడారు. శారీరక రుగ్మతలను దూరం చేయడానికి, వాటిని రాకుండా నిలువరించడానికి ప్రతిఒక్కరు యోగా, నడక, ధాన్యం ప్రతి నిత్యం చేయాలని ఆమె సూచించారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి వచ్చిన వైద్యులను ఈ సందర్బంగా జడ్జీ అభినంధించారు. శిబిరంలో బార్‌ అధ్యక్షుడు రమే‹Ù, బార్‌  ప్రతినిధులు, సీనియర్‌ సివిల్‌ జడ్జీ కిరణ్‌ మహి పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top