భారీ మెజార్టీతో ‘ఈటల’ గెలవాలి

Eetala Should with Big Majority - Sakshi

హుజూరాబాద్‌ నుంచి బిజిగిరిషరీఫ్‌ దర్గా వరకు పాదయాత్ర

సాక్షి, హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌ భారీ మెజార్టీతో గెలువాలని నియోజకవర్గ మైనార్టీ నాయకుడు గఫార్‌ అధ్యక్షతన సుమారు 116 మంది ముస్లింలు హుజూరాబాద్‌ నుంచి బిజిగిరిషరీఫ్‌ దర్గా వరకు బుధవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రను పట్టణంలోని అంబేద్కర్‌చౌరస్తా వద్ద మంత్రి ఈటల రాజేందర్‌ తన సతీమణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ముస్లింల సంక్షేమానికి ఈటల రాజేందర్‌ ఎనలేని కృషి చేశారన్నారు. నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు మైనార్టీ గురుకుల పాఠశాలలు ప్రారంభించడం, ముస్లిం ఆడపడుచుల పెళ్లికి షాదీముబారక్‌ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, మున్సిపల్‌ చైర్మన్‌ మంద ఉమాదేవి, మాజీ చైర్మన్‌ వడ్లూరి విజయ్‌కుమార్, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తాళ్లపల్లి రజిత శ్రీనివాస్, మార్కెట్‌ కమిటీ చెర్మన్‌ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు అపరాజ ముత్యంరాజు, గందె రాధిక శ్రీనివాస్, బర్మావత్‌ యాదగిరి నాయక్, నాయకులు మురాద హుస్సేన్, ఇమ్రాన్, ఫయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

జమ్మికుంటరూరల్‌(హుజూరాబాద్‌): ఈటల రాజేందర్‌ భారీ మెజార్టీతో గెలువాలని టీఆర్‌ఎస్‌ నాయకుడు ఎంఏ గఫార్‌ చేపట్టిన పాదయాత్ర జమ్మికుంటకు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అక్బర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మైనార్టీల సంక్షేమానికి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. మండల పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ సమీర్, దర్గా సదర్‌ అఫ్జలొద్దిన్, ప్రధాన కార్యదర్శి సయీమొద్దిన్, నాయకులు ఖదీర్, ఇమ్రాన్, జానీ, ఫయాజ్, సల్మాన్, షఫీ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top