ఇక సమరమే..

EC Announces Telangana Election Schedule - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ముందస్తు ఎన్నికల సమరం మొద లైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లో మరింత జోష్‌ నెలకొంది. నవంబర్‌ 12న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువరించనున్నట్లు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. డిసెంబర్‌ 7న పోలింగ్‌ నిర్వహించి 11న ఎన్నికల ఫలితాలను వెలువరిస్తామనివెల్లడిం చింది. దీంతో ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేసిన రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాయి.

అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌ ప్రచారంలో దూసుకెళ్తోంది. అందులో భాగంగానే వనపర్తిలో శుక్రవారం జరిగిన ప్రజాఆశీర్వాద సభకు స్వయంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు హాజరై విపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించకపోయినా ఉమ్మడి జిల్లాలో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టింది. అలంపూర్, గద్వాలలో తాజాగా జరిగిన సభ కు కాంగ్రెస్‌ ముఖ్యనేతలు హాజరై టీఆర్‌ఎస్‌పై విమర్శలతో ముప్పేట దాడి చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా గత నెలలో పాలమూరు గర్జన ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించారు. తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటంతో అన్నీ రాజకీయ పార్టీలు ప్రచారంలో మరింత జోరు పెంచనున్నాయి.
 
తేలని మహాకూటమి లెక్క 
ఎన్నికల నోటిఫికేషన్‌కు నెలరోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో రాజకీయ పార్టీలు అప్ర మత్తమయ్యాయి.  ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు విపక్ష పార్టీలన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడే ప్ర యత్నాల్లో వేగం పుంజుకోకపోవడంతో ఆయా పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేసీ కలిసి పోటీచేయాలని భావిస్తున్నాయి. అయితే మ హాకూటమి తరఫున పొత్తుల లెక్కలు అంచనాకు రావడం లేదు. ఉమ్మడి జిల్లాలో టీడీపీ రెండు లేదా మూడు స్థానాల కోసం పట్టుబడుతోంది. అలాగే తెలంగాణ జన సమితి కూడా రెండు లేదా మూడు స్థానాలు కావాలని డి మాండ్‌ చేస్తోంది. అయితే పాలమూరు జిల్లా లో కాంగ్రెస్‌ బలంగా ఉండటంతో మిత్రపక్షాల కు సాధ్యమైనంత తక్కువగా సీట్లు ఇవ్వాలని పార్టీ ముఖ్యులపై ఒత్తిడి పెరుగుతోంది. పొత్తుల లెక్కలు ఓ కొలిక్కి వస్తే పార్టీల సమీకరణాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

పాలమూరుపైనే ప్రధాన దృష్టి 
రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే పాలమూరు ప్రాంతంపై అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ ఈసారి మెజార్టీ స్థానా లు గెలుపొంది పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. అందుకు అనుగుణంగా ప్రచార పర్వంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. పార్టీకి అతి ముఖ్యనేతలైన కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ప్రచారంలో నిమగ్నమయ్యేలా ప్రణాళిక రూపొందించారు. అందుకు అనుగుణంగా ఇదివరకే నాగర్‌కర్నూల్‌ బహిరంగసభలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. తాజాగా వనపర్తిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. అంతేకాదు పాలమూరులో 20లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత తనదేనని ప్రకటించారు.
 
పోరులో విపక్షాలు సైతం.. 
పాలమూరు ప్రాంతం నుంచి ఎక్కువ స్థానాల్లో గెలుపొందేందుకు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు కసరత్తు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో గెలుపొందిన సిట్టింగ్‌ స్థానాలతో మరి కొన్ని స్థానాల్లో గెలుపొంది పట్టు నిలుపుకునేం దుకు కాంగ్రెస్‌ శతవిధాలా ప్రయత్నిస్తోంది. మాజీ మంత్రులు డీకే అరుణ, చిన్నారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డితో పాటు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి సైతం ఇక్కడి వారు కావడం తో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అం తేకాదు ఈసారి ముఖ్యనేతలంతా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తుండటంతో కాం గ్రెస్‌ శ్రేణుల్లో సైతం అంచనాలు పెరుగుతు న్నాయి. అలాగే సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ సైతం ప్రచారంలో నిమగ్నమైంది. ఉమ్మడి జిల్లాలో  కచ్చితంగా మూడు స్థానాల్లోనైనా గెలుపొందాలని కసరత్తు చేస్తోంది.

తారస్థాయికి చేరిన విమర్శలు 

ప్రచార పర్వం ఊపందుకుంటుండడంతో ప్రధాన పార్టీల నేతలు తమ నోటికి పని చెబుతున్నారు. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు తమ ప్రచారంలో సీఎం కేసీఆర్‌ కుటుంబంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా బట్టేబాజ్, ధోఖేబాజ్‌ అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ఇక ఫైర్‌బ్రాండ్‌ డీకే అరుణ సైతం కేసీఆర్‌పై మాటల తూటాలు పేల్చుతున్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలోని టీఆర్‌ఎస్‌ నేతలను ఎక్కడ సమావేశం పెడితే అక్కడ తూర్పారబడుతున్నారు. ఈ నేపథ్యంలో వనపర్తిలో టీఆర్‌ఎస్‌ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ చేసిన కామెంట్లు మరింత హీట్‌ పెంచాయి. తాజాగా డీకే అరుణ శనివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. తనపై చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ టీఆర్‌ఎస్‌పై తీవ్రంగా స్పందించారు. ఇలా మొత్తం మీద పరస్పరం చేసుకుంటున్న విమర్శలు.. మున్ముందు ఎక్కడికు దారి తీస్తాయోననే చర్చ జిల్లా రాజకీయవర్గాల్లో మొదలైంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top