గ్రామస్థాయికి ఈ–లైబ్రరీలు: కడియం

గ్రామస్థాయికి ఈ–లైబ్రరీలు: కడియం


తెలంగాణ ఈ–లైబ్రరీ పుస్తకావిష్కరణ

సాక్షి, హైదరాబాద్‌: ఈ– లైబ్రరీలను గ్రామస్థాయికి కూడా తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శనివారం రవీంద్రభారతిలో ప్రజా గ్రంథాలయాల విభాగం ఆధ్వర్యంలో లైబ్రేరియన్స్‌డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడు కల్లో కడియం శ్రీహరి ఈ–లైబ్రరీ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. న్యూఢిల్లీకి చెందిన డిజిటల్‌ ఎంపవర్‌ మెంట్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవటం అభినందనీయమన్నారు. దీనికి భారత ప్రజా గ్రంథాలయ ఉద్యమం, భాషా సాంస్కృతిక విభాగం సహకారం అందించటం గర్వించదగ్గ విషయమన్నారు.


అన్ని జిల్లాల కేంద్రాల్లోని లైబ్రరీలను డిజిటల్‌ ఎంపవర్‌మెంట్‌ అడాప్ట్‌ చేసుకోవటం అభినందనీయమన్నారు. తెలంగాణలోని గ్రంథాలయ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు, పింఛనర్లకు 010 పద్దు కింద ట్రెజరీ నుండి జీతాలు, పింఛన్లు ఇప్పించా లన్న డిమాండ్‌ను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం ఈ–లైబ్రరీ ప్రోగ్రాం పుస్తకాన్ని  ఆవిష్క రించారు. తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ ఆయాచితం శ్రీధర్, సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్,ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, బెవర్జెస్‌ చైర్మన్‌ దేవీప్రసాదరావు, ఉద్యోగనేత కారెం రవీందర్‌రెడ్డి, డిజిటల్‌ ఎంపవర్‌మెంట్‌ ఫౌండేషన్‌ మేనేజర్‌ మణికంఠ పాల్గొన్నారు.

Back to Top