మత్తులో ముత్యాల నగరం..!

Drugs Mafia Increasing In Hyderabad - Sakshi

ఎల్‌సీడీ, ఎండీఎంఏ, హెరాయిన్‌ వంటి మాదకద్రవ్యాలకు అడ్డాగా భాగ్యనగరం

కొలంబియా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా 

సముద్ర మార్గంలో రహస్యంగా గోవా తీరానికి తరలింపు 

అక్కడి నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్‌కు అక్రమ రవాణా 

డార్క్‌నెట్, సోషల్‌ మీడియాల ద్వారా విక్రయాలు.. ధనికుల పిల్లలు, సెలబ్రిటీలే లక్ష్యంగా దందా 

హైదరాబాద్‌లో ఏయే డ్రగ్స్‌ ఉన్నాయి? 
డ్రగ్‌ మార్కెట్‌కు భాగ్యనగరం అడ్డాగా మారింది. ఇక్కడ చాలా రకాల డ్రగ్స్‌ అందుబాటులో ఉంటున్నాయి.వీటిలో దేశంలో తయారయ్యేవి, విదేశాల నుంచి వచ్చేవి కూడా ఉన్నాయి. గంజాయి, భంగ్, కీటమైన్‌ తదితరాలు స్థానిక ఉత్పత్తులు కాగా, బయటనుంచి వచ్చే ఎల్‌ఎస్‌డీ, ఎక్స్‌టసీ, ఎండీఎంఏ, బ్రౌన్‌షుగర్, హెరాయిన్‌ తదితరాలు నగర యువతను మత్తులో ముంచుతున్నాయి. పార్టీ కల్చర్, విందులు, వినోదాలు పెరుగుతుండటం, సామాజిక మాధ్యమాలతో అనుసంధానం సులువుగా మారడంతో వీటిని ఎప్పుడైనా, ఎక్కడైనా అందుకునే వెసులుబాటును డ్రగ్స్‌ విక్రయదారులు కల్పిస్తున్నారు. డబ్బున్న పిల్లలను, ఉద్యోగులను, వ్యాపారులను, సినీనటులను లక్ష్యంగా చేసుకుని తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిస్తున్నారు. కానీ.. వీటిని వినియోగిస్తున్న వారు మాత్రం.. క్షణకాలం మత్తు కోసం అలవాటు పడి, క్రమంగా బానిసలై, దేహాన్ని, జీవితాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. 

నగరంలో డ్రగ్స్‌ మాఫియానెమ్మదిగా విస్తరిస్తోంది.  వాస్తవానికి నగరానికిమత్తు కొత్త కాదు.  నవాబుల కాలం నుంచి గంజాయి, సారా, భంగ్‌ తదితరాలు తీసుకోవడం అలవాటుగా వస్తున్నదే.స్వాతంత్య్రం తరువాత వాటిని ప్రభుత్వంనిషేధించినా.. మత్తు రూటు మార్చింది.నగరవాసుల్లో కోటీశ్వరులు పెరిగారు.వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు,సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, రియల్‌ ఎస్టేట్‌ కారణంగా నగరంలో ధనికులు పెరిగారు.దీంతో సహజంగానే లగ్జరీ లైఫ్‌ అలవాటైంది. దీంతో డ్రగ్స్‌ ముఠాలు ఇలాంటి ధనికులను, వారి తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకున్నాయి. ఊహించని స్థాయిలో స్పందన వస్తుండడంతో వారి ఆదాయం లక్షల నుంచి కోట్ల రూపాయలకు  పెరిగింది. ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ, హెరాయిన్‌ వంటి  మాదకద్రవ్యాలకు అడ్డాగా భాగ్యనగరం కొలంబియా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా 

ఏ డ్రగ్‌ ఎలా వస్తోంది..? 
గంజాయి
నగరంలోకి భారీ ఎత్తున వస్తున్న మత్తు పదార్థాల్లో గంజాయిదే మొదటిస్థానం. నగరంలో చాలామంది దీన్ని వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు చాలామంది సిగరెట్లకు బదులు గంజాయి కాల్చడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని శివారు కాలేజీల పరిసరాల ప్రాంతాలే వీరి విక్రయాలకు అడ్డాలు. సాధారణంగా నగరానికి వరంగల్, ఖమ్మం, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, వైజాగ్, విజయనగరం నుంచి ఈ గంజాయి రైలు, రోడ్డు మార్గాల ద్వారా వస్తుంది. దీన్ని నమలడం, చుట్ట, సిగరెట్లలో కాల్చడం ద్వారా తీసుకుంటారు. ఇటీవల ద్రవరూపంలోనూ తయారుచేస్తున్నారు. మనదేశంలో 3,414.14 హెక్టార్ల గంజాయి పంటను రహస్యంగా అడవుల్లో సాగుచేస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు దాడులు చేసి ఏటా 3వేల ఎకరాల వరకు పంటలను ధ్వంసం చేస్తున్నారు. 

ఎండీఎంఏ
ఎండీఎంఏ కూడా చాలా ప్రమాదకరమైన డ్రగ్‌. ఎండీఎంఏ అంటేం మిథైలిన్‌ డయాక్సి మెథం ఫెటామైన్‌. దీన్నే ఎక్స్‌టసీ అని కూడా పిలుస్తారు. క్యాప్సూల్‌లో పౌడర్‌ లేదా ట్యాబ్లెట్‌ రూపంలో విక్రయిస్తారు. సిగరెట్లలో పెట్టుకుని తీసుకుంటారు. ఇది ఎల్‌ఎస్‌డీ కన్నా ఎక్కువ ప్రమాదకరం. సాధారణంగా ఈ మందును క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా జంతువులపై ప్రయోగిస్తుంటారు. 3, 4 ట్యాబ్లెట్లు ఒకేసారి వేసుకుంటే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఈ డ్రగ్‌ తీసుకున్నవాళ్లు ఉద్రేకంగా, కోపంగా, పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. అధిక రక్తపోటు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలతో ఉంటారు. మనదేశంలో ఈ డ్రగ్‌ వినియోగం తక్కువే అయినా ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, అమెరికా యూరోప్‌లలో అధికంగా వినియోగిస్తున్నారు. 

స్పీడ్‌బాల్‌
కొకైన్‌ను స్పీడ్‌ బాల్హెరాయిన్‌ అనే మాదకద్రవ్యంతో కలిపి వేడి చేసి తీసుకునే మరో డ్రగ్‌ పేరే స్పీడ్‌ బాల్‌. మామూలుగానే వీటిని తీసుకుంటే.. శరీరంపై తీవ్ర ప్రభా వం ఉంటుంది. అలాంటిది ప్రమాదకర, శక్తిమంతమైన రెండు డ్రగ్స్‌ను కలిపి తీసుకుంటే.. రెండింతల మత్తు తలకెక్కుతుంది. ఇవి ఒక్క గ్రాము తీసుకున్నా మనిషి 12 గంటలపాటు లేవడు. చరస్, హషీష్‌ ఆయిల్, భంగ్, బ్రౌన్‌ షుగర్లాంటి డ్రగ్స్‌ కూడా ఉన్నాయి. గంజాయి వంటివీ మత్తు కలిగించేవే. ఇవి స్థానికంగా తయారయ్యే మాదకద్రవ్యాలు. వీటి వల్ల శరీరంపై ప్రభావం తక్కువే. కానీ, దీర్ఘకాలం వాడితే అవి కూడా ప్రతికూల ఫలితాలు కనిపిస్తాయి. 

కీటమైన్‌
కీటమైన్‌. సాధారణంగా దీన్ని ఆపరేషన్ల సమయంలో అనస్తీషియా నిపుణులు మాత్రమే వినియోగిస్తారు. ఇది తీసుకుంటే శరీరంలోని లైంగిక çహార్మోన్లు అకస్మాత్తుగా విడుదలవుతాయి. దీన్ని స్ఫటికాలు, పౌడర్‌ రూపంలో తయారుచేస్తున్నారు. దీనికి ఎలాంటి రంగు, రుచి, వాసన ఉండదు. దీన్ని పార్టీల్లో అమ్మాయిలపై ప్రయోగిస్తుంటారు. కిడ్నాప్‌లు, లైంగిక దాడులు, అమ్మాయిల అక్రమ రవాణాకు ఈ మందును వినియోగిస్తున్నారు. కూల్‌డ్రింక్, ఆహారం, ముక్కుతో పీల్చడం, సిగరెట్ల ద్వారా దీన్ని తీసుకోవచ్చు. ఇది వాడగానే.. మనిషి స్పృహ కోల్పోతాడు. ఒక్క గ్రాము వినియోగిస్తే.. 5 నుంచి 8 గంటల దాకా స్పృహలోకి రాలేరు. ఇంతకాలం విదేశాల ద్వారా గోవాకు, అక్కడ నుంచి నగరానికి వచ్చేది. ఇటీవల ఈ గ్యాంగ్‌ను బెంగళూరులో పట్టుకోగా, నగరంలోని నాచారంలో ఏకంగా ఓ ఫ్యాక్టరీనే పెట్టారని ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు.  

హెరాయిన్‌
ఓపియం. దీన్నే నల్లమందు (మార్ఫిన్‌)గా వ్యవహరిస్తారు. పెపావర్‌ సోమ్నిఫెరమ్‌ అనే మొక్క గింజల నుంచి దీన్ని సేకరిస్తారు. ఇది ఎక్కువగా కొండ ప్రాంతాల్లోనే పెరుగుతుంది. వాస్తవానికి దీనిలోని ఆల్కలాయిడ్స్‌ నొప్పి నివారిణిగా పనిచేస్తాయి. తలనొప్పి, ఇతర నొప్పులకు వినియోగించే మాత్రల్లో ఈ గింజలను వాడతారు. ప్రపంచంలో చాలా దేశాల్లో దీన్ని నిషేధించాయి. అఫ్గానిస్తాన్‌లో ఇదే అధికారిక పంట కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తోన్న నల్లమందులో 90% ఇక్కడ నుంచే రవాణా అవుతోంది. అఫ్గానిస్తాన్‌ నుంచి పాకిస్తాన్‌కు, అక్కడ నుంచి పంజాబ్‌ సరిహద్దుల ద్వారా ఇండియా చేరుతోంది. పంజాబ్‌ నుంచి ఢిల్లీ, ముంబై ప్రాంతాల ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల్లో దీన్ని విక్రయిస్తున్నారు. కిలో సోమ్నిఫెరం గింజలు దాదాపు రూ.కోటి పలుకుతాయి. వీటిని ప్రాసెస్‌ చేసి హెరాయిన్‌గా మార్చి విక్రయిస్తారు. దీన్ని ఒక గ్రాము తీసుకున్నా దాని ప్రభావం 12 గంటలపాటు ఉంటుంది. ఒత్తిడి తగ్గి, మనిషి ఎక్కడలేని సంతోషంగా కనిపిస్తాడు. దీన్ని కూడా టాబ్లెట్లు, ఇంజెక్షన్, సిగరెట్ల రూపంలో తీసుకుంటారు.  

కొకైన్‌
కోకా చెట్టు ఆకుల నుంచి ఈ కొకైన్‌ను తయారు చేస్తారు. దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి కొకైన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతోంది. ముఖ్యంగా సముద్ర మార్గాల ద్వారా గోవా, ముంబై ఓడరేవులకు చేరుతోంది. అక్కడ నుంచి దేశంలోని బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలకు రవాణా చేస్తున్నారు. దీన్ని పార్టీ డ్రగ్‌గా పిలుస్తారు. దీనికి స్టఫ్, ఫ్లాకీ, స్నో, కోకా, సోడాలాంటి కోడ్‌పేర్లూ ఉన్నాయి. ఈ మందును ముక్కుతో పీల్చడం, ఇంజెక్షన్‌ చేసుకోవడం, సిగరెట్‌లో నింపుకుని కాల్చడం ద్వారా శరీరంలోకి తీసుకుంటారు. ఒక్కసారి ఇది శరీరంలోకి చేరగానే.. ఇందులో వందల రెట్లు డోపమైన్‌ విడుదలవుతుది. ఇది తీసుకోగానే శరీరంలో విడుదల చేసే ఆల్కలాయిడ్స్‌ వల్ల ఏదో కొత్త ధైర్యం వచ్చినట్లు అవుతుంది. దీని కారణంగా మనిషిలో నేరప్రవృత్తి పెరుగుతుంది. ఇది తీసుకున్నవారు పిచ్చి పట్టినట్లుగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. అసాధారణంగా అరుస్తూ, ఎదుటివారిపై దౌర్జన్యాలకు దిగుతుంటారు. అందువల్ల ఈ మందులను అధికంగా తీవ్రవాదుల కోసం, ఉగ్రవాదుల కోసం, నేరస్తుల కోసం సరఫరా చేస్తుంటారు. అందుకే దీన్ని ‘క్వీన్‌ ఆఫ్‌ డ్రగ్స్‌’గా పిలుస్తుంటారు. వీటిని తీసుకున్న యువత కేంద్ర నాడీమండలంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అధికమోతాదులో తీసుకుంటే కోమాలోకి వెళ్లి ప్రాణాలు కూడా పోతాయి. 

కోకా చెట్టు ఆకుల నుంచి ఈ కొకైన్‌ను తయారు చేస్తారు. దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి కొకైన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతోంది. ముఖ్యంగా సముద్ర మార్గాల ద్వారా గోవా, ముంబై ఓడరేవులకు చేరుతోంది. అక్కడ నుంచి దేశంలోని బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలకు రవాణా చేస్తున్నారు. దీన్ని పార్టీ డ్రగ్‌గా పిలుస్తారు. దీనికి స్టఫ్, ఫ్లాకీ, స్నో, కోకా, సోడాలాంటి కోడ్‌పేర్లూ ఉన్నాయి. ఈ మందును ముక్కుతో పీల్చడం, ఇంజెక్షన్‌ చేసుకోవడం, సిగరెట్‌లో నింపుకుని కాల్చడం ద్వారా శరీరంలోకి తీసుకుంటారు. ఒక్కసారి ఇది శరీరంలోకి చేరగానే.. ఇందులో వందల రెట్లు డోపమైన్‌ విడుదలవుతుది. ఇది తీసుకోగానే శరీరంలో విడుదల చేసే ఆల్కలాయిడ్స్‌ వల్ల ఏదో కొత్త ధైర్యం వచ్చినట్లు అవుతుంది. దీని కారణంగా మనిషిలో నేరప్రవృత్తి పెరుగుతుంది. ఇది తీసుకున్నవారు పిచ్చి పట్టినట్లుగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. అసాధారణంగా అరుస్తూ, ఎదుటివారిపై దౌర్జన్యాలకు దిగుతుంటారు. అందువల్ల ఈ మందులను అధికంగా తీవ్రవాదుల కోసం, ఉగ్రవాదుల కోసం, నేరస్తుల కోసం సరఫరా చేస్తుంటారు. అందుకే దీన్ని ‘క్వీన్‌ ఆఫ్‌ డ్రగ్స్‌’గా పిలుస్తుంటారు. వీటిని తీసుకున్న యువత కేంద్ర నాడీమండలంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అధికమోతాదులో తీసుకుంటే కోమాలోకి వెళ్లి ప్రాణాలు కూడా పోతాయి. 

15 ఏళ్లకే మత్తుకు బానిసలు: ఐరాస 
2017లో నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్‌ కుంభకోణం తెలుగు రాష్ట్రాలను భారీగా కుదిపేసింది. స్కూలు పిల్లలకు కూడా నగరంలో డ్రగ్స్‌ అలవాటు చేస్తున్నారని పట్టుబడ్డ నిందితులు పోలీసులకు చెప్పడంతో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ స్కాంను పోలీసులు బట్టబయలు చేయగలిగారు. అప్పుడు డ్రగ్స్‌ విక్రయదారుల వద్ద దొరికిన నంబర్ల ఆధారంగా నగరంలో పేరొందిన వేలాదిమంది విద్యార్థులకు వాళ్లు డ్రగ్స్‌ అమ్మినట్లుగా పోలీసులు గుర్తించారు. బాధితులు మైనర్లు కావడంతో పేర్లు వెల్లడించకుండా, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ రాకెట్‌లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు తారలు, సాంకేతిక నిపుణులను పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. 15 ఏళ్ల వయసులోనే కొందరు పిల్లలు మత్తుపదార్థాల బారిన పడుతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ డ్రగ్స్‌ మార్కెట్‌లో భారత్‌కు 3% వాటా ఉందని కూడా వెల్లడించింది. 

డార్క్‌నెట్‌తో పకడ్బందీగా.. 
డ్రగ్స్‌ తయారీ, రవాణా ఒక ఎత్తయితే.. వాటిని విక్రయించడం, నమ్మకమైన వినియోగదారులను సంపాదించడం మరో ఎత్తు. ఇంటర్నెట్‌ వచ్చాక చాలామంది వీటిని నెట్‌లోనే ఆర్డర్‌ చేస్తున్నారు. తమ లావాదేవీలు తెలియకుండా విక్రయదారులు చాలా పకడ్బందీగా ఉంటారు. ఇందుకోసం డార్క్‌నెట్‌ను వాడతారు. దీన్ని సాధారణ సెర్చ్‌ ఇంజిన్లు, సాఫ్ట్‌వేర్‌తో యాక్సెస్‌ చేయలేరు. పోలీసులు కూడా వీటిని గుర్తించలేరు. అందువల్లే డ్రగ్‌ డీలర్లు తమ లావాదేవీలు డార్క్‌నెట్‌ను వేదికగా చేసుకుంటున్నారు. దీనికితోడు కొంతకాలంగా సోషల్‌ మీడియా పెరిగిపోవడంతో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ద్వారా కూడా వీటిని ఆర్డర్‌ చేస్తున్నారు. డబ్బులు కూడా ఆన్‌లైన్‌లో చెల్లిస్తుండటంతో డ్రగ్‌ పెడ్లర్లు (రవాణా చేసేవారు) క్షణాల్లో సరుకు డెలివరీ చేసేస్తున్నారు. 

చట్టాలు కఠినతరం చేయాలి 
ఒక సందర్భంలో డ్రగ్స్‌ సరఫరా చేసిన వారి వద్ద దొరికిన ఫోన్‌ నంబర్లన్నీ స్కూలు చిన్నారులవి కావడంతో మేమంతా అవాక్కయ్యాం. విచారణలో ఆ పిల్లలంతా డ్రగ్స్‌ తీసుకున్నట్లు అంగీకరించారు. హైస్కూలు పిల్లలను ఇలాంటి వ్యసనాలకు గురిచేసినవారికి కఠిన శిక్షలు పడాలంటే.. చట్టాలు మరింత బలోపేతం చేయాలి.   
-సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, తెలంగాణ పోలీసు విభాగం.  

శివారు ప్రాంతాలే అడ్డా.. 
నగరంలో చాలా మంది డ్రగ్స్‌ కోసం శివారు ప్రాంతాలకే వెళ్తారు. పబ్‌లు, రిసార్ట్‌లు, ఫాంహౌస్‌లలో జరిగే పార్టీలే ఇందుకు వేదికలు. కొంతకాలంగా మొదలైన రేవ్‌ పార్టీలు, ముజ్రాపార్టీల సంస్కృతి డ్రగ్స్‌ వినియోగం పెరగడానికి కారణమైంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరిగే యువత మ్యూజికల్‌ నైట్‌లు, న్యూఇయర్‌ వేడుకల్లోనూ విచ్చలవిడిగా డ్రగ్స్‌ వినియోగం జరుగుతోంది. హైదరాబాద్‌లో చదువు, వ్యాపారం, పర్యాటకం పేరుతో వస్తున్న నైజీరియన్లు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. అనేక సార్లు పట్టుబడి జైలుకెళ్తున్నా.. వీరి తీరులో మార్పు రావడం లేదు. కొత్తవారు వస్తూనే ఉన్నారు. డబ్బున్న పిల్లలను, సెలబ్రిటీలను, సినిమా తారలను టార్గెట్‌ చేసుకుని వీరు దందా సాగిస్తున్నారు. 

పిల్లల్ని గమనిస్తుండాలి... 
పెద్ద కుటుంబాల్లో తల్లిదండ్రులకు పిల్లలతో గడిపే తీరిక ఉండదు. చెడు స్నేహాల వల్ల వారు మత్తుకు బానిసలవుతున్నారు. తమ ఆలోచనలను, పిల్లలు పంచుకోవాలంటే.. తల్లిదండ్రులే చొరవ చూపాలి. పిల్లల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించాలి. పిల్లలు ఆందోళన, ఒత్తిడి, భయానికి గురవుతున్నారా? లేదా గుర్తించాలి. ఇటీవల ఆత్మహత్యలు చేసుకునే ముందు ఓ విద్యార్థి తన 10 మంది స్నేహితులకు విషయం చెప్పినా.. ఎవరూ నమ్మలేదు. అంత కష్టమొచ్చినా.. తల్లిదండ్రులకు చెప్పుకోకపోవడం వల్లే ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకుంది. 
– సౌమ్యా మిశ్రా, అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ (వెల్ఫేర్, తెలంగాణ పోలీస్‌)  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top