మెరుగైన సేవల కోసం ‘కీ ఫెర్ఫార్మెన్స్‌’ 

DGP Mahender Reddy is a long review with commissioners and SPs - Sakshi

కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ మహేందర్‌రెడ్డి సుదీర్ఘ సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన పోలీస్‌ సేవలు(ఏకరూప పోలీసింగ్‌) అందించేందుకు అధికారులు, సిబ్బందికి పని విభజన చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. పోలీస్‌ స్టేషన్లతో పాటు ఇతర విభాగాల్లో రోజువారీగా నిర్వహించే విధులను కీ ఫెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్లుగా గుర్తించనున్నారు. ఈ విధు ల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు, ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేసేందుకు ఎస్పీ లు, కమిషనర్లు కృషి చేయాలని డీజీపీ సూచించారు.

రాష్ట్ర పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ‘కీ ఫెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌’ సర్వీస్‌ డెలివరీ విధానంపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. స్టేషన్లలో పనిచేసే ప్రతీ సిబ్బందికి ఇక నుంచి స్పష్టమైన పని విభజన ఉంటుందని, వారు చేసే పనికి, ఇతర రోజువారీ పనికి ఎలాంటి సం బంధం ఉండదని మహేందర్‌రెడ్డి చెప్పారు. పని విభజ న ద్వారా క్షేత్రస్థాయిలో బలోపేతమవుతామని, నిరంతర సమాచార మార్పిడి, ఉత్తమ విధానాలు అందిçపుచ్చుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు. అంతేకాకుండా ప్రతీ సిబ్బంది, అధికారికి తమ పాత్రపైనా స్పష్టత వచ్చి ఉద్యోగంపై గౌరవంతో పాటు సంతృప్తి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సిబ్బంది పనితీరును కొలిచేందుకు ఫంక్షనల్‌ వర్టికల్స్‌ రూపొందిస్తున్నామని, ఇందుకోసం కీ ఫెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ విధానం కీలకంగా ఉపయోగపడుతుందన్నారు. దీని మానిటరింగ్‌కు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ కేంద్రాన్ని ప్రస్తుతానికి సీఐడీలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

బంజారాహిల్స్‌లో పూర్తి కాబోయే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సీఐడీతో పాటు మార్చడం జరుగుతుందని డీజీపీ తెలిపారు. జిల్లాలు, కమిషనరేట్లలోని క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో అధికారులు ఈ విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని, ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్‌ సిబ్బంది చేసే ఏయే పనులను వర్టికల్‌ ఫంక్షన్లలోకి తీసుకురావాలని, కీ ఫర్ఫామెన్స్‌ ఇండికేటర్స్‌గా ఉండాల్సిన అంశాలపై అధికారుల బృందాలు కార్యాచరణ రూపొందించాయి. ఈ సమావేశంలో సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌ సింగ్, టెక్నికల్‌ విభాగం అదనపు డీజీపీ రవిగుప్తా, ఇతర ఐపీఎస్‌ అధికారులు, ఎస్పీలు, కమిషనర్లు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top