తస్మాత్‌! అదుపు తప్పితే.. కుదుపే

Coronavirus Awareness on Hyderabad People - Sakshi

గ్రేటర్‌లో థర్డ్‌ కాంటాక్ట్‌ కలకలం

తాజాగా దోమలగూడ వైద్య దంపతులకు పాజిటివ్‌

ఉలిక్కి పడిన సిటిజన్లు.. వరుస కేసులతో భయాందోళన

చాపకింద నీరులా విస్తరించే అవకాశం ఉన్నట్లు సంకేతాలు

అప్రమత్తం కాకుంటే భారీ ముప్పు తప్పదంటున్న నిపుణులు

లాక్‌డౌన్‌ మాత్రమే సరిపోదు.. స్వీయనియంత్రణ తప్పనిసరి

లేదంటే ఏ రూపంలోనైనా కరోనా సోకే ప్రమాదం

నిత్యావసరాలంటూ ముప్పు తెచ్చుకోవద్దు

గుంపులు, గుంపులుగా వెళ్లకపోవడమే శ్రేయస్కరం

ఇప్పటి వరకు 45 కేసులు నమోదు  

వీటిలో 27 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే..

సాక్షి, సిటీబ్యూరో: కరోనా గ్రేటర్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోందనేందుకు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న పాజిటివ్‌ కేసులే నిదర్శనం. తెలంగాణలో ఇప్పటివరకు 45 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వీటిలో 27 కేసులు హైదరాబాద్,రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోనే కావడం నగరవాసులను భయాందోళనకు గురి చేస్తోంది. విదేశాలకు వెళ్లివచ్చిన నేపథ్యం లేకపోయినప్పటికీ ఇద్దరు గృహిణులు, ఓ యువకుడు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా దోమలగూడకు చెందిన వైద్య దంపతులకు సైతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే శంషాబాద్‌లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తించే ఓ స్టాఫ్‌ నర్స్‌ కూడా కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నట్లు సమాచారం. స్వీయ నియంత్రణపై నిర్లక్ష్యం కారణంగానే థర్డ్‌ ఇంపాక్ట్‌ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎందరో కరోనా బారిన పడ్డారో తెలియని పరిస్థితి నగరవాసిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం రెండో దశ చివరి అంకంలో ఉంది. స్వీయనియంత్రణ లేకుంటే మాస్‌ క్యాజువాలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఉన్న గాంధీని పూర్తిస్థాయి కరోనా ఆస్పత్రిగా మార్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.  కాగా.. నగరంలో నిత్యావసర వస్తువులకు ఎటువంటి కొరత లేదని సీపీ అంజనీ కుమార్‌  స్పష్టం చేశారు.  –

అంటుకుందిలా..
1 సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారి (50) తన భార్యతో సహా ఈ నెల 14న దుబాయి మీదుగా హైదరాబాద్‌ చేరుకున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆయన గాంధీలో చేరారు. 17న వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది. 21న ఆయన కుమారుడు (35)కి సైతం పాజిటివ్‌వచ్చింది. తండ్రి నుంచి కుమారుడికి,ఆ తర్వాత మరుసటి రోజుభార్యకు కరోనా పాజిటివ్‌నిర్ధారణ అయింది.

2 రంగారెడ్డి జిల్లా మణికొండకు చెందిన యువకుడు (34) మార్చి 14నస్వీడన్‌ నుంచి హైదరాబాద్‌కుచేరుకున్నాడు. ఈ నెల 22న ఆయనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.ఇతని నుంచి ఆయన తల్లి (64)కివైరస్‌ సోకింది. 24న ఆమెకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. విదేశాలకువెళ్లి వచ్చిన దాఖలా కూడాఈమెకు లేదు.

3 రంగారెడ్డి జిల్లాకోకాపేటకు చెందిన వ్యక్తి (49) ఇటీవల లండన్‌ నుంచి సిటీకి చేరుకున్నాడు. కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో ఆయనకు ఈ నెల 24న  వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది. 25న ఆయన భార్య (43)కు పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది. నిజానికి ఆమె ఇతర దేశాలకు వెళ్లలేదు కానీ భర్త నుంచి ఆమెకు వైరస్‌ సోకినట్లు తేలింది.

4 తాజాగా గురువారం దోమలగూడకు చెందిన వైద్యదంపతులిద్దరికీ కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. నిజానికి వీరిద్దరూ విదేశాలకు వెళ్లి వచ్చిన నేపథ్యం లేదు. స్థానికంగా వేరే వ్యక్తుల నుంచి వీరికి  సోకినట్లు సమాచారం. వీరిద్దరూ సిటీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.దంపతులిద్దరూ ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించడం గమనార్హం.   

కరోనా కేసులు ఇలా..
77,045మార్చి 24 వరకువిదేశాల్లో పర్యటించిశంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వారు
17,283వీరిలో దగ్గు, జలుబు,జ్వరం లక్షణాలు ఉన్నట్లు గుర్తించినవారు
856వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం సేకరించిన నమూనాలు
45వీటిలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసులు
699ఐసోలేషన్‌ వార్డులో చేరి,నెగిటివ్‌ రావడంతో ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన వారు
113 వ్యాధి నిర్ధారణపరీక్షల రిపోర్ట్‌ కోసం ఎదురు చూస్తున్నవారు
33 ప్రస్తుతంగాంధీలోని పాజిటివ్‌ కేసులు
10ఛాతీ ఆస్పత్రిలో ఉన్న పాజిటివ్‌ కేసులు
01చికిత్స అనంతరం కోలుకుని,డిశ్చార్జి అయినవారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

29-03-2020
Mar 29, 2020, 20:58 IST
సాక్షి, హైదరాబాద్‌ : ఏప్రిల్‌ 7 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 12 మంది తప్ప మిగిలిన కరోనా...
29-03-2020
Mar 29, 2020, 18:00 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలకు ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ శుభవార్త చెప్పారు. గతంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన...
29-03-2020
Mar 29, 2020, 16:51 IST
కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు రూ. 25 కోట్లు భారీ విరాళం ప్రకటించి అక్షయ్‌...
29-03-2020
Mar 29, 2020, 16:37 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19పై పోరాటానికి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముందుకొచ్చింది. ప్రధానమంత్రి సహాయనిధికి తమ వంతుగా రూ. 51...
29-03-2020
Mar 29, 2020, 15:26 IST
లండన్‌ : ప్రపంచ దేశాలపై కరోనా వైరస్‌ కరాళనృత్యం చేస్తోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ తన ఒడిలోకి చేర్చుకుంటోంది....
29-03-2020
Mar 29, 2020, 15:24 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ విజ్ఞప్తి చేశారు....
29-03-2020
Mar 29, 2020, 15:15 IST
లక్నో : కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్‌ గాంధీ పోస్ట్‌...
29-03-2020
Mar 29, 2020, 14:36 IST
న్యూఢిల్లీ/ హైదరాబాద్‌ : మన్ కీ బాత్‌లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ కరోనా పాజిటివ్‌ వచ్చిన తొలి తెలంగాణ యువకుడితో ఫోన్‌లో మాట్లాడారు....
29-03-2020
Mar 29, 2020, 14:29 IST
భార‌త మాజీ క్రికెట‌ర్‌ జోగింద‌ర్ శ‌ర్మ‌.. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వ్యాప్తి క‌ట్ట‌డికి న‌డుం బిగించాడు. ఆయ‌న‌ సొంత రాష్ట్ర‌మైన హ‌ర్యాణాలో ఖాకీ...
29-03-2020
Mar 29, 2020, 14:28 IST
కొన్ని ప్రాంతాల్లో వలసకూలీలు.. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నట్లుగా గుర్తించామని దీనిని పూర్తిగా నివారించాలని కేంద్రం స్పష్టం చేసింది. ...
29-03-2020
Mar 29, 2020, 14:22 IST
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, నగరాల్లో నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 11 వరకే అనుమతిస్తున్నట్టు డిప్యూటీ సీఎం ఆళ్ల...
29-03-2020
Mar 29, 2020, 14:02 IST
హైదరాబాద్‌: కరోనా పోరులో ప్రపంచ దేశాల కంటే భారత్‌ ఎంతో ముందుందని తెలంగాణ ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు....
29-03-2020
Mar 29, 2020, 13:55 IST
కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో సెలబ్రెటీలు ఇంటి పట్టునే ఉంటున్నారు. దీంతో తమకు ఇష్టమైన వ్యాపకాల్లో మునిగి తేలుతున్నారు. హీరోయిన్‌...
29-03-2020
Mar 29, 2020, 13:32 IST
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కరోనా వైరస్‌ (కోవిడ్‌–19 ) దెబ్బకు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. ఈ నెల 19వ తేదీన ఒంగోలు...
29-03-2020
Mar 29, 2020, 13:08 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కరోనావైరస్‌పై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఆదివారం కరోనా కేసు నమోదు కాలేదని...
29-03-2020
Mar 29, 2020, 13:06 IST
మహమ్మారి కరోనా కబంధ హస్తాల్లో చిక్కిన ప్రపంచ దేశాల జనం పిట్టల్లా రాలిపోతున్నారు.
29-03-2020
Mar 29, 2020, 12:45 IST
సాక్షి, నగరి : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పేద ప్రజలు తిండికి ఇబ్బంది పడొద్దనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...
29-03-2020
Mar 29, 2020, 12:15 IST
కరోనా వైరస్‌ నియంత్రణకు 21రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించడంతో సామాన్య జనం నుంచి ప్రముఖులు వరకూ ఇళ్లకే పరిమితం అయ్యారు....
29-03-2020
Mar 29, 2020, 12:14 IST
మహమ్మారి కరోనాకు స్పెయిన్‌ యువరాణి మారియా థెరీసా బలయ్యారు.
29-03-2020
Mar 29, 2020, 11:06 IST
చిన్నారి మరణంపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని ఐడీపీహెచ్‌ డైరెక్టర్‌ ఎంగోజి ఎంజికె చెప్పారు.
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top