ఎన్ని సీట్లో..!

Congress MLA Candidates Tension Nizamabad - Sakshi

టికెట్ల కేటాయింపుల్లో సామాజిక కోణం తెరపైకి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిత్వాల ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ ఐదు స్థానాలను బీసీలకు కేటాయించింది. సామాజిక సమీకరణతోపాటు గెలుపు గుర్రాలకే అధిష్టానం టికెట్లు కేటాయిస్తుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ టికెట్ల కేటాయింపుల్లో సామాజిక సమీకరణ అంశం తెరపైకి వస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థిత్వాల ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలనే  నిర్ణయంతో ఉన్న కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమి టీ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలతో సంప్రదింపులు జరపడం పార్టీలో చర్చనీయంశంగా మారింది.  2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఐదు స్థానాలను బీసీలకు కేటాయించింది. నిజామాబాద్‌ అర్బన్, నిజామాబాద్‌ రూరల్, బాన్సువాడ, బా ల్కొండ, ఎల్లారెడ్డి స్థానా ల్లో బీసీ సామాజికవర్గాలకు చెందిన అభ్య ర్థులు పోటీ చేశారు.

అలాగే కామారెడ్డి నుంచి మైనార్టీ నేత, బోధన్, ఆర్మూర్‌ల నుంచి ఓసీ నేత లు బరిలోకి దిగారు.ఈసారి కూడా ఆయా స్థానాలకు ఆర్మూర్‌ మినహా మిగతా చోట్ల దాదాపు పాత వారే టికెట్లు ఆశిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. సామాజిక సమీకరణలతోపాటు గెలుపు గుర్రాలకే పార్టీ అధిష్టానం టికెట్లు కేటాయిస్తుందని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం తొమ్మిది స్థానాల్లో జుక్కల్‌ (ఎస్సీ) మినహాయిస్తే.. కామారెడ్డి, బోధన్, ఆర్మూర్‌ స్థానాలకు ఆ పార్టీ టికెట్లు దాదాపు ఖరారయ్యాయి.

కామారెడ్డి స్థానం ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన నేతకు, బోధన్‌ స్థానం ఓసీ నేతకు, ఆర్మూర్‌ స్థానం బీసీ మహిళకు కేటాయించనుంది. నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ను ఈ పార్టీలో ఇద్దరు బీసీ లు, ఓ మైనార్టీ నేత ఆశిస్తున్నారు. బాల్కొండ స్థానం నుం చి కూడా ప్రస్తుతానికి బీసీ నేత పేరు పరిశీలనలో ఉంది. కాగా ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు సారుప్యత ఉండటం తో ఒక స్థానం బీసీలకు కేటాయిస్తే., మరోస్థానం ఓసీలకు దక్కే అవకాశాలే ఎక్కువ ఉం టాయని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం ఉంది. కాగా రూరల్‌లో ఇద్దరు ఓసీ నేతలు టికెట్‌ కోసం పోటీ పడుతుండగా, ఎల్లారెడ్డి, బాన్సువాడ స్థానాలకు బీసీ, ఓసీ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top