వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి

Congress, BJP find it hard to oust Asaduddin Owaisi  - Sakshi

ఏపీలో 25 పార్లమెంట్‌ స్థానాల్లో జగన్‌తో కలసి ప్రచారం 

తెలంగాణలో కేసీఆర్‌తో కలసి 16 స్థానాల సభల్లో పాల్గొంటా 

బీజేపీ, కాంగ్రెస్‌కుబుద్ధి చెప్పే రోజులొచ్చాయి

కాలాపత్తర్‌ సభలోఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌

హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించి ఇటు టీఆర్‌ఎస్, అటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని ఆలిండియా మజ్లిస్‌–ఇ–ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. పాతబస్తీ కాలాపత్తర్‌లోని తాడ్‌బన్‌లో మంగళవారం రాత్రి జరిగిన జల్సా యాద్‌–ఇ–ఖయాద్‌–ఇ–మిల్లత్‌ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితో కలసి ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రచారం చేస్తానని అన్నారు. 25 పార్లమెంట్‌ స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల గెలుపునకు విస్తృత ప్రచారం నిర్వహిస్తానని, జగన్‌తో కలసి బహిరంగ సభల్లో పాల్గొంటానన్నారు.

అలాగే తెలంగాణలో 16 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్నారు. కేసీఆర్‌తోపాటు సభల్లో పాల్గొంటానని అన్నారు. కాంగ్రెస్, బీజేపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన సమయం ఆనస్నమైందన్నారు. బిహార్‌ ప్రభుత్వం ముస్లిం యువకుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తోందన్నారు. నరేంద్ర మోదీతో చేతులు కలిపిన నితీశ్‌ సర్కార్‌ అరాచకాలను అడ్డుకుంటామన్నారు. ఏప్రిల్‌ 11న జరిగే పోలింగ్‌లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మజ్లిస్‌ పార్టీని మతతత్వ పార్టీ అని కొందరు రాజకీయ పార్టీల నాయకులు బురద జల్లుతున్నారని, దీనిని పట్టించుకోవద్దన్నారు.

హైదరాబాద్‌లో అన్ని వర్గాల ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవిస్తున్నారని.. కుల, మతాలకు అతీతంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతోందన్నారు. రంజాన్‌ మాసం పవిత్రమైందని... అల్లాను వేడుకున్న ప్రతి ఒక్కరికి అంతా మంచే జరుగుతుందన్నారు. రంజాన్‌ మాసంలో ఎన్నికలు ఉన్నా ఇబ్బందేమీ రాదని అన్నారు. 70 ఏళ్ల క్రితం భారత్‌కు స్వాతంత్రం వచ్చింది రంజాన్‌ మాసంలోనేనని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మజ్లిస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top