టీ రేషన్‌ యాప్‌ను వినియోగించుకోవాలి

Collector Amrapali Started Civil Supplies Department Control Room - Sakshi

కలెక్టర్‌ అమ్రపాలి

పౌర సరఫరాల శాఖ కమాండ్‌ కంట్రోల్‌ రూం ప్రారంభం

హన్మకొండ అర్బన్‌: టీరేషన్‌ యాప్‌ను లబ్ధిదారులు వినియోగించుకోవాలని కలెక్టర్‌ అమ్రపాలి అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు పారద్శకంగా సరుకులు అందజేసేందుకు జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూంను డీఈఓ కార్యాలయంలోని పౌరసరఫరాల కార్యాలయంలో శుక్రవారం ప్రాంరభించారు. అనంరతం ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా సరఫరా అవుతున్న బియ్యం, హాస్టళ్లకు పంపిణీ, రేషన్‌షాపుల్లో నిల్వలు ఆన్‌లైన్‌ ద్వారా సీసీ కెమెరాల సాయంతో కమాండెంట్‌ కంట్రోల్‌ రూం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుందన్నారు.రేషన్‌ విషయంలో ఇబ్బందులు ఉన్నట్‌లైతే 7330774444 నంబర్‌కు వాట్సాప్‌ సమాచారం అందజేయాలని తెలిపారు. మార్చి ఒకటినుంచి రాష్ట్రంలో ఏషాపు నుంచైనా సరుకులు తీసుకునే అవకాశం కల్పించారని తెలిపారు. డీఎస్‌ఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీ రేషన్‌ మొబైల్‌ యాప్‌ ప్రచార పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ దయానంద్, డీసీఎస్‌ఓ విజయలక్ష్మి, డీఎం విజేందర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

హరితహారం అమలుకు ప్రణాళికలు సిద్ధం చేయండి
హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, గతంలో నాటిన వాటిని సంరక్షించడానికి అధికారులు శాఖల వారిగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ అమ్రపాలి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు. మాట్లాడుతూ రానున్న జూన్, జైలై మాసాల్లో మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. మునిసిపల్‌ల్, కుడా ఆధ్వర్యంలో పది లక్షల మొక్కలు, అటవీశాఖ ఆధ్వర్యంలో 10లక్షల మొక్కలు,  హార్టికల్చర్,  సెరికల్చర్, అగ్రికల్చర్‌ ఆధ్వర్యంలో 5లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అదే విధంగా శిఖం భూములు, బంజరు భూములు, గుట్ట ప్రదేశాలు, ఇతర నీటి లభ్యత గల ప్రదేశాలు ఎంపిక చేసి మొక్కలు నాటించాలన్నారు. సమావేశంలో డీఎఫ్‌ఓ అర్పణ, జేసీ దయానంద్, డీపీఓ మహెమూది, డీఆర్‌డీఓ రాము, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జాబ్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పించాలి
జిల్లాలో ఈజీఎస్‌ జాబ్‌ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని  కలెక్టర్‌ అమ్రపాలి అన్నారు. ముఖ్యంగా జిల్లాలో  ఫాంపాండ్స్‌ నిర్మాణాలు చేపట్టేందుకు రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఈజీఎస్‌ అమలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాది పనుల వేగవంతానికి పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఎంపీడీఓలు కృషిచేయాలన్నారు. గ్రామాల్లో అవసరాలకు తగ్గట్లు పనులు గుర్తించి పనులు చేయాలన్నారు. కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లించే విధంగా ఎంపీడీఓలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 100రోజులు పనిదినాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో జేసీ దయానంద్, డీఆర్‌డీఓ రాము, ఎంపీడీఓలు, ఎఫ్‌ఏలు, టీఏలు పాల్గొన్నారు.

‘భగీరథ’ పనులు పూర్తి చేయాలి
మిషన్‌ భగీరథ పనులను  మే మొదటివారం నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ అమ్రపాలి అధికారులను ఆదేశించారు.  మీనీ కాన్ఫరెన్స్‌ హాల్లో మిషన్‌ భగీరథపనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు.  ఆమె మాట్లాడుతూ ఇంట్రా విలేజ్‌ కింద చేపడుతున్న పనులు సత్వరం పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు 30శాతం పైప్‌ లైన్‌ పనులు పూర్తిచేయడం జరిగిందని, ట్యాంకుల నిర్మాణం కొన్నిచోట్ల ఇం కా ప్రారంభం కాలేదని అన్నారు. జిల్లాలో రూ.66. 17కోట్లతో 161ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణం, 352కిలోమీటర్ల పైప్‌లైన్‌ పనులకోసం 25మంది కాట్రాక్టర్లతో ఒప్పందం కుదర్చుకున్నామని తెలిపారు.  ఆర్‌డబ్ల్యూఎస్‌  ఈఈ మల్లేశం, డీఈ స్వేత, ఏఈ మధు, కాం ట్రాక్టర్లు చంద్రశేఖర్, సుధాకర్, శ్రీనివాస్, నాగార్జునరెడ్డి, సత్యనారాయణ, ఉపేందర్, రాజు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top