ఢిల్లీకి సీఎం కేసీఆర్‌

CM KCR tour to Delhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం రాత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మంగళవారం ఢిల్లీలో జరగనున్న పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) చైర్మన్‌ రాజీవ్‌శర్మ కుమారుడి వివాహానికి ఆయన హాజరై.. రాత్రి హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు.

డిసెంబర్‌ తొలి వారంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉందని, అక్కడ ప్రధాని మోదీని కలసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తానని గత గురువారం విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో ప్రధాని మోదీతోపాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలెవరినీ సీఎం కలవడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top