టీడీపీ సీనియర్లతో చంద్రబాబు అత్యవసర భేటీ

Chandrababu Emergency Meeting With TDP Senior Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ టీడీపీ సీనియర్లతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి భేటీ కానున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో అత్యవసర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆ పార్టీ సీనియర్‌ నేతలు ఎల్‌ రమణ, రావుల పెద్దిరెడ్డి ఇతర నాయకులు పాల్గొననున్నారు.

తెలంగాణ ఎన్నికలు, టీడీపీ వ్యూహం, పొత్తులపై ప్రధానంగా చర్చజరగనుంది. చంద్రబాబు ఈ సమావేశంలో మేనిఫెస్టో కమిటీ, స్ట్రాటజీ కమిటీ, ప్రచార కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. కాంగ్రెస్‌తో పొత్తుపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌తో పొత్తు ఉండాలా? వద్దా? అన్నదానిపై సమీక్ష చేయనున్నారు. కాంగ్రెస్‌తో పొత్తుపై తెలంగాణ నాయకత్వానికి స్పష్టత ఇవ్వనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top