నేతలతో ఈసీ బృందం కీలక భేటీ

CEC Meeting With Political Parties In Telangana - Sakshi

సాక్షి, తెలంగాణ : తెలంగాణలో​ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం​ బృంధం రాష్ట్రాంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలతో మంగళవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై పార్టీ నేతలతో సీఈసీ బృందం చర్చించనుంది. భేటీలో పాల్గొనే ఒక్కో పార్టీకి ఈసీ పది నిమిషాల సమయం కేటాయించింది. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీ వినోద్‌తో కూడిన బృందం హాజరయ్యారు. కాంగ్రెస్‌ నుంచి మర్రి శశిధర్‌ రెడ్డి బృందం, బీజేపీ నుంచి వెంకటరెడ్డి బృందం , సీపీఎం నుంచి డీజీ నరసింహరావు బృందం, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి బృందం, ఎంఐఎం నుంచి జాఫ్రీ, అక్బరుద్దీన్‌ ఓవైసీ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికలపై  ఈసీ బృందానికి ప్రతిపక్షాలు పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

మొదటగా బీఎస్పీతో కేంద్ర సీఈసీ బీఎస్పీతో చర్చించింది. బీఎస్పీ నుంచి సమావేశానికి హాజరైన ఎల్లన్న మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాలెట్‌ విధానాన్ని కొనాసాగించాలని కోరినట్లు ఆయన తెలిపారు. వీవీ ప్యాట్స్‌ల సమస్య లేకుండా ఏర్పాట్లు చేయాలని, కొత్త ఓటర్ల నమోదు గడువును పెంచాలని ఈసీ బృందాన్ని కోరినట్లు ఎల్లయ్య తెలిపారు.

ముగిసిన సీపీఐతో భేటీ..
 ప్రధాని నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలనీ.. ఇప్పుడు కేసీఆర్‌ ఎన్నికలకు వెళ్తున్నారని సీపీఐ తరుఫు నుంచి భేటీలో పాల్గొన్న చాడ వెంకట్‌రెడ్డి భేటీలో పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తూ.. వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నట్లు ఈసీ బృందానికి ఫిర్యాదు చేసిట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ రద్దు చేయగానే ఆయనే షెడ్యూల్‌ ప్రకటించారని.. 30 లక్షల ఓట్లు గల్లంతయ్యాయిని తెలిపారు. ఏపీలో కలిపిన ఏడు ముంపు మండలాల పరిస్థితి గురించి వారి వద్ద ఆరా తీసినట్లు వెంకట్‌ రెడ్డి తెలిపారు. 

ఈసీని మిస్‌లీడ్‌ చేస్తున్నారు..
ఓటర్ల డ్రాఫ్ట్‌ లిస్ట్‌ ఇండా ప్రకటించకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి సీఈసీ బృందాన్ని ప్రశించారు. రాష్ట్రంలో మూడు నియోజకవర్గల్లో తప్ప ఎక్కడా సప్లే చేయ్యలేదని ఈసీకి చెప్పినట్లు ఆయన తెలిపారు. ఓటర్‌ లిస్ట్‌లో ఇంటి నంబర్‌ లేకుండా ఎలా ఇస్తారని.. తప్పుడి లిస్ట్‌ను అధికారులకు అందించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వినాయక చవితి, మోహర్రం ఉన్నందున అధికారులకు సమయం సరిపోదని వారికి తెలిపినట్లు ఇంద్రసేనా రెడ్డి వెల్లడించారు. 

హైదరాబాద్‌లోనే నకిలీ ఓటర్లు..
నాలుగు నెలల్లో చేయాల్సిన ప్రక్రియను కేవలం నాలుగు వారాల్లో చేయడం సాధ్యపడదని ఈసీ బృందానికి తెలిపినట్లు కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌​ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల సంఘం తన జేబులో ఉన్నట్లు కేసీఆర్‌ షెడ్యూల్‌ ప్రకటించారని.. ఎన్నికల ప్రతిష్ట మట్టి కరిచిపోతుందని వారికి ఫిర్యాదు చేసినట్లుఆయన తెలిపారు. ఆపధర్మ ప్రభుత్వం ఎంత కాలం ఉండాలో.. ఇలా రద్దు చేస్తే 324 అధికరణను సవరణ చేయాల్సి వస్తుందని వారితో చర్చించినట్లు పేర్కొన్నారు.హైదరాబాద్‌ విపరీతంగా డూప్లికేట్‌ ఓట్లు ఉన్నాయని.. కాంగ్రెస్‌ వ్యక్తిగా కాకుండా, ఒక సిటిజన్‌గా పోరాటం చేస్తున్న అని వారితో చర్చించారు.  వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తే అక్కడ ఉప ఎన్నికలు ఎందుకు పెట్టలేదని.. న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ సీఈసీ బృందాన్ని ప్రశ్నించినట్లు ఆయన తెలిపారు. అవసరమైతే ఎన్నికలపై సుప్రీంకోర్టుకి వెళ్తామని ఈసీకి తెలిపినట్లు వెల్లడించారు.

పండగలు అడ్డుకాదు..
ఎన్నికలకు పండుగల అడ్డుకాదని ఈసీతో తెలిపినట్లు  ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్‌ ఒవైసీ తెలిపినట్లు ఆయన వెల్లడించారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటు సాగదీయ్యకూడదని ఈసీని కోరినట్లు ఒవైసీ పేర్కొన్నారు.

మొదటిసారి జరుగుతున్న ఎన్నికలు
ఆపధర్మ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉంటడం అంత మంచిది కాదని.. అందుకే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరినట్లు టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ వెల్లడించారు. తొలిసారి తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయని.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని వారితో కోరినట్లు ఆయన తెలిపారు. ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్‌ తెలంగాణ ప్రభుత్వంపై నిందలు వెయడం తగదని ఆయన పేర్కొన్నారు. విభజన చట్టంపై కూడా భేటీలో చర్చించినట్లు ఆయన వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top