నిజామాబాద్‌ అడవుల్లో పేలిన నాటుబాంబు..!

Bomb Blast In Nizamabad One Cow Died - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : డిచ్ పల్లి మండలం సుద్దపల్లి అటవీ ప్రాంతంలో నాటు బాంబులు కలకలం రేపాయి. వన్యప్రాణుల కోసం అమర్చిన నాటుబాంబులు ఓ మూగజీవాన్ని బలితీసుకున్నాయి. గడ్డి తింటూ వెళ్లిన ఓ ఆవు నాటు బాంబును నోట కరవడంతో అది పేలింది. తీవ్ర గాయాలపాలైన ఆవు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సుద్దపల్లి అటవీ ప్రాంతంతో పాటు తెలంగాణ యూనివర్సిటీ భూముల్లో వేటగాళ్లు, వన్యప్రాణుల స్మగ్లర్లు నాటు బాంబులకు ఆహార పదార్థాలు, పిండి పదార్థాలు చుట్టీ వన్యప్రాణులను వేటాడుతున్నారని స్థానికులు చెప్తున్నారు. పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అరుదైన అలీకర్ జాతికి చెందిన పాడి ఆవు బుధవారం మృత్యువాత పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అంకుష్ గోశాల సంరక్షణలో ఉన్నట్టు తెలిసింది.

కాగా, అంకుష్‌ గోశాల నిర్వాహకులు ఆవు మృతిపై డిచ్‌పల్లి పొలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ గోశాలలో 27 రకాల జాతులకు చెందిన 500 ఆవుల సంరక్షణ జరుగుతోందని.. మేతకు సమీపంలోని అటవీ ప్రాంతాలకు నిత్యం వెళ్తుంటాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని అటవీ ప్రాంతాల్లో యథేచ్ఛగా వన్యప్రాణుల వేట సాగుతున్నా అటవీ అధికారులు చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని వ్యన్యప్రాణి ప్రేమికులు విమర్శలు గుప్పిస్తున్నారు. వేటగాళ్ల కారణంగా మూగ జీవాలు బలవుతున్నాయని, వారికి రాజకీయ నాయకులు అండగా నిలబడుతున్నారని చెప్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణకు మహారాష్ట్ర మాదిరి కఠిన చట్టాలను తీసుకురావాలని కోరుతున్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
నిజామాబాద్ జిల్లాలో రెచ్చిపోతున్న వేటగాళ్లు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top