'ఆయనవి దరిద్రమైన ఆలోచనలు'

'ఆయనవి దరిద్రమైన ఆలోచనలు'


హైదరాబాద్‌: బంగారు తెలంగాణ అని చెప్పి.. మద్యం తెలంగాణగా మారుస్తున్నారని టీఆర్‌ఎస్‌నుద్దేశించి బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్‌వి దరిద్రమైన ఆలోచనలని మండిపడ్డారు. షాపింగ్‌ మాల్స్‌లో మద్యం అమ్మకాలకు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. తెలంగాణ సర్కార్‌ మద్యం పాలసీలు సిగ్గు పడేలా ఉన్నాయని మండిపడ్డారు.మహిళల ఆత్మ గౌరవ సమస్య ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. నూతన మద్యం పాలసీని వెంటనే రద్దు చేయాలన్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులకు మహిళలంటే గౌరవం లేదన్నారు. ఆసియాలోనే అత్యధిక మద్యం అమ్మకాలు జరిపిన సీఎంగా కేసీఆర్‌కు అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టిన గతే 2019 లో టీఆర్‌ఎస్‌కు పడుతుందని ఆకుల విజయ అన్నారు. అక్టోబర్‌ 1 నుంచి వైన్‌షాపుల్లోనే కాదు షాపింగ్‌మాల్స్‌లో కూడా కోరిన మందు బాటిల్స్‌ లభించనున్న విషయం తెలిసిందే.

Back to Top