నల్లగొండ ఉప ఎన్నికలో బీజేపీ పోటీ: లక్ష్మణ్‌

BJP contest in Nallagonda by-election: Laxman

సాక్షి, సిద్దిపేట: నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ప్రక టించారు. గురువారం సిద్దిపేటలో ఆయన విలేక రులతో మాట్లాడారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతామని, అందుకు నల్లగొండ ఉప ఎన్నికను వినియోగించుకుంటామన్నారు.

ప్రధా ని మోదీ అవినీతి రహిత పాలనకు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నార న్నారు. నల్లగొండ ఒక్కచోటనే ఉప ఎన్నిక నిర్వ హించడం సరికాదని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌ లో చేరిన పార్టీ ఫిరాయింపుదారులందరి చేత రాజీనామా చేయించి వారి స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

Back to Top