చిరుతలున్నాయి జాగ్రత్త 

Beware of cheetahs - Sakshi

ఇబ్రహీంపట్నం: దండుమైలారం, హాఫీజ్‌పూర్‌ అటవీ ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తం గా ఉండాలని ఫారెస్టు డిప్యూటీ రేంజ్‌ ఆఫీ సర్‌ గురుప్రసాద్‌సరోడే స్థానికులకు సూచి ంచారు. సోమవారం ఆయా అటవీ ప్రాం తాన్ని సందర్శించి చిరుత పులుల జాడ లు, సంచారంపై ఆరా తీశారు. అయితే చిరుత పులి సేదతీరే ప్రదేశాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..

మూడు నాలుగు చిరుత పులులు సంచారిస్తున్నాయని. మేక, గొర్రెలను మేపేందుకు ఆ ప్రాంతలోకి పంపవద్దన్నారు. అటవీ ప్రాంత సమీపంలో ఉన్న మేకల, పశువుల పాకలకు ఇనుప జాలిలు వేసుకోవాలన్నారు. పలువురు రైతులు చిరుత సంచారాన్ని చూసినట్లు అధికారులకు తెలిపారు. ఆయన వెంట అటవీ శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ భాస్కరాచారి, పవన్‌కుమార్, జంగారావులున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top