తెలంగాణ నేతలపై అమిత్‌ షా సీరియస్‌

Amith Shah Fires On Teleangana Bjp Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పార్టీ బలోపేతానికి సరైన చర్యలు చేపట్టడం లేదంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర నేతలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బూత్‌ కమిటీల నియామకంలో జాతీయ పార్టీ రూపొందించిన మార్గదర్శకాలతో కాకుండా సొంత ఎజెండాతో ఎందుకు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ 23 మార్గదర్శకాలను పొందుపరచగా, రాష్ట్ర నేతలు 12 గైడ్‌లైన్స్‌కే వాటిని ఎందుకు కుదించారని ప్రశ్నించారు. వచ్చే మాసాంతానికి బూత్‌ కమిటీల ఏర్పాటును పూర్తిచేయాలని ఆదేశించారు.

ఒక నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌లను ఏ, బీ, సీ, డీలుగా విభజించాలని, ప్రతి బూత్‌లో అయిదుగురు స్మార్ట్‌ ఫోన్లు కలిగిన వారిని,ఐదుగరు బైక్‌లు ఉన్న కార్యకర్తలను విధిగా గుర్తించాలని సూచించారు.

కాగా, పార్టీ ఇటీవల తెలంగాణవ్యాప్తంగా చేపట్టిన జనచైతన్య యాత్ర వివరాలపైనా ఆయన ఆరా తీసినట్టు సమాచారం. యాత్రకు ప్రజల నుంచి స్పందన ఏవిధంగా ఉందనే అంశాలతో పాటు, ఏయే నియోజకవర్గాల్లో సాగిందని నేతలను అడిగి తెలుసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top