వేలి చివర నల్లరంగును గర్వంగా చూపాలి

Adivi Sesh Opinion On Vote Right - Sakshi

సెలబ్రిటీ  వాయిస్‌

బంజారాహిల్స్‌: ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు ఉండగానే సరిపోదు.. దానిని సద్వినియోగంచేసుకున్నపుడే సార్థకత ఏర్పడుతుంది. నేను అమెరికా పౌరుడిని. నాకు అక్కడే ఓటు హక్కు ఉంది. అమెరికాలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఓటు వేస్తాను. ఎక్కడున్నా సరే యూఎస్‌ ఎన్నికల్లో నా ఓటు హక్కు కచ్చితంగా వినియోగించుకుంటా. అమెరికాలో జరిగిన గత ఎన్నికల్లో నేను షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నాను. ఇక్కడినుంచే నా ఓటుహక్కును నిబంధనల మేరకు వినియోగించుకున్నా. ఓటుకు నేనెంత ప్రాధాన్యమిస్తానో దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు. డిసెంబర్‌ 7న తెలంగాణ జరిగే శాసన సభ ఎన్నికల్లో మీ ఓటు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం కట్టాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top